Crime: రూ. 900 కోట్ల బంగారం స్వాధీనం | Rs 900 crore gold seized by Tamil Nadu flying squad | Sakshi
Sakshi News home page

900 కోట్ల రూపాయల బంగారం స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్‌

Apr 15 2024 7:42 AM | Updated on Apr 15 2024 7:46 AM

Rs 900 crore gold seized by Tamil Nadu flying squad - Sakshi

ఎన్నికల వేళ బంగారం బిస్కెట్లతో వెళ్తు‍న్న వ్యాన్‌ను ఎట్టకేలకు ఓఆర్‌ఆర్‌పై.. 

చెన్నై:  ఎన్నికల వేళ తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌ పరిధిలో కుండ్రత్తూర్‌ రహదారిలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టింది. అటుగా వచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటెయినర్‌ లారీలను సోదా చేశారు. ఓ లారీలో 1,025 కిలోలు, మరో వాహనంలో 400 కిలోల బంగారం గుర్తించారు.

స్వాధీనం చేసుకుని వివరాలు ఆరా తీశారు. బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూర్‌ సమీప మన్నూర్‌లోని ఓ గోదాముకు తరలిస్తున్నట్లు తెలిసింది. 400 కిలోలకు ఆధారాలు ఉన్నాయని మిగిలినదానికి లేనట్లు తెలిసింది. అధికారులు చెన్నై విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులను సంప్రదించారు. వీటి మొత్తం విలువ రూ.900 కోట్లు ఉంటుందని అంచనా. 

ఇదిలా ఉంటే.. ఎలక్షన్‌ ప్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు ఓ పంచాయితీ ప్రెసిడెంట్‌ ఇంటి నుంచి కోటి రూపాయాల్ని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎట్టారై గ్రామం పంచాయితీ ప్రెసిడెంట్‌ దివ్య అన్బరసన్‌ నుంచి ఈ సొమ్మును రికవరీ చేశారు. ఆమె అన్నాడీఎంకేకు చెందిన నేత.

Advertisement
 
Advertisement
Advertisement