రతన్‌ టాటా ఆరోగ్య పరిస్థితి విషమం | Ratan Tata in critical ​health condition Sources | Sakshi
Sakshi News home page

రతన్‌ టాటా ఆరోగ్య పరిస్థితి విషమం

Oct 9 2024 7:57 PM | Updated on Oct 9 2024 8:25 PM

Ratan Tata in critical ​health condition Sources

ముంబై: టాటా సన్స్‌ అధినేత రతన్‌ టాటా ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయన్ను ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్‌ విభాగంలో చికిత్స పొందుతున్నారు.

ఇటీవల దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్‌ సంస్థ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా ఆరోగ్యంపై  వదంతులు వెల్లువెత్తాయి. దీంతో ఆయనే స్వయంగా సమాధానమిచ్చారు. రక్తపోటు తగ్గడంతో సోమవారం తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రికి రతన్‌ టాటా వెళ్లారు. 

దీంతో 86 ఏళ్ల రతన్‌ ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఐసీయూలో చేరారని జాతీయ మీడియాలో వెంటనే కథనాలు వెలువడ్డాయి. వీటిపై ఆయన తన సామాజిక మాధ్యమం ఖాతా ‘ఎక్స్‌’లో స్పందించారు. ‘‘ నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంతో తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్లా. నేను బాగానే ఉన్నా. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ఆయన స్పష్టంచేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement