Rahul Gandhi: అదానీ లబ్ధి కోసమే అగ్నివీర్‌: రాహుల్‌ | Agniveer Scheme Brought To Benefit Business House Instead Of Soldiers, Says Rahul Gandhi - Sakshi
Sakshi News home page

Rahul Gandhi: అదానీ లబ్ధి కోసమే అగ్నివీర్‌: రాహుల్‌

Feb 17 2024 5:27 AM | Updated on Feb 17 2024 10:04 AM

Rahul Gandhi: Agniveer scheme brought to benefit business house - Sakshi

న్యూఢిల్లీ/మొహానియా: పారిశ్రామికవేత్త అదానీకి ప్రయోజనం కలిగించేందుకే కేంద్రంలో మోదీ ప్రభుత్వం అగ్నివీర్‌ పథకం తెచ్చిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. దేశ సరిహద్దులను కాపాడే జవాన్లకు వేతనాలివ్వడం మోదీకి ఇష్టం లేదన్నారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం బిహార్‌లోని కైమూర్‌ జిల్లా మొహానియాలో ర్యాలీలో మాట్లాడారు. ‘‘సాధారణ సైనికుడి మాదిరిగా అగ్నివీర్‌కు వేతనం, పింఛను ఉండవు.

క్యాంటిన్‌ సౌకర్యముండదు. విధి నిర్వహణలో మరణిస్తే అమరవీరుడి గుర్తింపూ ఇవ్వరు. రక్షణ బడ్జెట్‌ నుంచి సైనికులకు వేతనాలు, వసతులు కల్పించడం మోదీ సర్కారుకు ఇష్టం లేదు. బడ్జెట్‌ను అదానీకి లబ్ధి కలిగిలా ఖర్చు చేయాలనుకుంటోంది’’ అని ఆరోపించారు. బిహార్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ తదితరులు కూడా యాత్రలో పాల్గొన్నారు. ప్రియాంకా గాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో శుక్రవారం యాత్రలో పాల్గొనలేకపోయినట్టు పార్టీ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement