అభయ ఘ‌ట‌న భ‌యాన‌కం: రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము | President Droupadi Murmu Reacts To Kolkata Doctor Case, More Details Inside | Sakshi
Sakshi News home page

అభయ ఘ‌ట‌న భ‌యాన‌కం: రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

Aug 28 2024 4:32 PM | Updated on Aug 28 2024 5:35 PM

President Droupadi Murmu reacts to Kolkata doctor case

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా అభయ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌జీకార్‌ ఘటన తనని భయబ్రాంతులకు గురిచేసిందని అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూతుళ్లు, అక్కాచెల్లెళ్లు ఇలాంటి అఘాయిత్యాలకు గురికావడాన్ని ఏ నాగరిక సమాజం అనుమతించదు.. చాలు’అని సూచించారు. 

నిర్భయ ఘటన జరిగిన 12 ఏళ్లలో లెక్కలేనన్ని దారుణాలు జరిగాయి. సమాజం వాటిని మర్చిపోయింది. ఇటువంటి సామూహిక మ‌తిమ‌రుపు అస‌హ్య‌క‌ర‌మైందని అన్నారు.  

ఈ సందర్భంగా ఉత్తరాఖండ్, మహారాష్ట్రలో నర్సులపై అఘాయిత్యాలు, మలయాళ చిత్ర పరిశ్రమలో వివాదాలపై రాష్ట్రపతి ముర్ము పరోక్షంగా స్పందించారు. కోల్‌కతా అభయ కేసులో విద్యార్థులు, వైద్యులు, పౌరులు నిరసనలు చేస్తున్నప్పటికీ నేరస్థులు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement