‘27 ఏళ్లుగా హోలీ అన్నదేలేదు’.. ఓ పోలీసు ఆవేదన | This Policeman has not been able to Celebrate Holi With his Family | Sakshi
Sakshi News home page

‘27 ఏళ్లుగా హోలీ అన్నదేలేదు’.. ఓ పోలీసు ఆవేదన

Published Fri, Mar 14 2025 10:54 AM | Last Updated on Fri, Mar 14 2025 11:17 AM

This Policeman has not been able to Celebrate Holi With his Family

దేశంలో హోలీ వేడుకలు(Holi celebrations) అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి. వాడవాడలా జనం ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుంటూ ఆనందంలో మునిగితేలుతున్నారు. అయితే హోలీ వేళ భద్రతా విధులు చేపడుతున్న పోలీసులు తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సివస్తోంది. దీంతో వారు కొంతమేరకు అసంతృప్తికి లోనవుతున్నారు.

ఒక పోలీసు తాను కుటుంబ సభ్యులతో హోలీ వేడుకల్లో పాల్గొనలేకపోతున్నానంటూ విడుదల చేసిన ఒక వీడియో సోషల్‌ మీడియా(Social media)లో వైరల్‌గా మారింది. సాధారణంగా పండుగలకు ఎవరికైనా సెలవు ఉంటుంది. అలా లేని పక్షంలో ఆఫీసులో సెలవు పెట్టుకుని, పండుగపూట ఇంటిలోని వారితో ఆనందిస్తుంటారు. అయితే తనకు గత 27 ఏళ్లుగా ఎప్పుడూ ఇంటిలోనివారతో హోలీ ఆడేందుకు అవకాశం రాలేదని కానిస్టేబుల్‌(Constable) సంజీవ్‌ కుమార్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశాడు.
 

ఈ వీడియోలో సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘ఫ్రెండ్స్‌, ఈ రోజు నేనెంతో ఆవేదన చెందుతున్నాను. నేను గత 27 ఏళ్లుగా పోలీసు డ్యూటీ నిర్వహిస్తున్నాను. ఈ 27 ఏళ్లలో ఎన్నడూ ఇంటిలోని వారితో హోలీ చేసుకోలేదు. మహాకుంభ్‌ డ్యూటీ ముగిశాక సెలవు దొరుకుతుందని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఇప్పుడు మేముండే హర్దోయీ(యూపీ)కి వెళ్లలేను. జనమంతా స్వస్థలాలకు వెళ్లి, హోలీ వేడుకల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. పోలీసు విధుల కారణంగా నేను ఇంటికి రాలేనని ఇంటిలోని వారికి చెప్పాను’ అని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: ఇదేం హోలీరా బాబూ.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement