
దేశవ్యాప్తంగా హోలీ(Holi) ఉత్సవాలు ఆనందంగా జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు ఉత్సాహంగా రంగులు జల్లుకుంటూ వేడుక చేసుకుంటున్నారు. రంగులు జల్లేందుకు పలువురు వివిధ మార్గాలను ఎన్నుకుంటుంటారు. ఇందుకోసం కొందరు కలర్ పౌడర్లను వినియోగిస్తుండగా, మరికొందరు రంగు నీళ్లను వినియోగిస్తుంటారు. అయితే దీనికి భిన్నంగా జరిగిన ఒక హోలీ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
गांव की होली का अंदाजा भी नहीं शहर वालो को🤣
हमारे यहां ऐसा ही होता है pic.twitter.com/445Pxr2mHw— @Madhu_queen (@madhu_quen) March 13, 2025
ఈ వీడియో(Video)లో ఒక యువకుడు మరో యువకుడి ఎత్తుకుని తీసుకువెళ్లి, ఒక బురద గుంతలో పడేస్తాడు. దీంతో ఆ కుర్రాడి శరీరమంతా బురదమయంగా మారిపోతుంది. అలాగే ఆ కుర్రాడు బురదలో నుంచి లేవడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ హోలీ సందర్భంగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘గ్రామాల్లో జరిగే హోలీ వేడుకలను ఎవరూ అంచనా వేయలేరని, మా గ్రామంలోనూ ఇలానే జరుగుతుందని’ రాశారు. మరొకరు ‘వారు వింత మనుషుల్లా ఉన్నారంటూ’ కామెంట్ రాశారు.
ఇది కూడా చదవండి: నేడు హోలీ.. రంజాన్ ప్రార్థనలు.. దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం
Comments
Please login to add a commentAdd a comment