మహిళా పోలీస్‌పై ఇన్‌స్పెక్టర్‌ అత్యాచారం | UP Police Inspector Suspended Over Molestation On Woman Police | Sakshi
Sakshi News home page

మహిళా పోలీస్‌పై ఇన్‌స్పెక్టర్‌ అత్యాచారం

Dec 6 2020 4:44 PM | Updated on Dec 7 2020 5:26 AM

UP Police Inspector Suspended Over Molestation On Woman Police - Sakshi

లక్నో : మహిళా పోలీస్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఓ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెండయ్యాడు. ఈ  సంఘటన ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన రాకేశ్‌ యాదవ్..‌ క్రైం బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత అక్టోబర్‌ 29న ఓ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను తను ఉన్న హోటల్‌ గదికి తీసుకురావల్సిందిగా ఓ మహిళా పోలీస్‌ను ఆదేశించాడు. హోటల్‌ గదికి వెళ్లిన ఆమెపై అత్యాచారం చేశాడు. (పిల్లల కళ్ల ముందే సెల్ఫీ వీడియో తీసుకొని..)

ఈ విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు దారుణంగా ఉంటాయని ఆమెను హెచ్చరించాడు. దీంతో ఆమె ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది. అయితే దాన్ని అలసుగా తీసుకున్న రాకేశ్‌ తరుచుగా ఆమెకు ఫోన్‌ చేస్తూ అసభ్యంగా మాట్లాడేవాడు. దీంతో సహనం కోల్పోయిన ఆమె జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement