Lara Thermal Plant: నేడు లారా థర్మల్‌ ప్లాంట్‌ జాతికి అంకితం!

PM Will Dedicate Lara Thermal Plant to the Nation - Sakshi

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో నిర్మితమైన ఎన్‌టీపీసీకి చెందిన 1,600 మెగావాట్ల లారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (శనివారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేయనున్నారు. రెండవ దశలో మరో 1,600 మెగావాట్ల ప్లాంట్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

మొదటి దశ స్టేషన్‌ను దాదాపు రూ.15,800 కోట్లతో అభివృద్ధి చేశామని, రెండో దశ ప్రాజెక్టుకు రూ.15,530 కోట్ల పెట్టుబడులు రానున్నాయని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాజెక్ట్ కోసం బొగ్గు ఎన్‌టీపీసీకి చెందిన తలైపల్లి బొగ్గు బ్లాక్ నుండి మెర్రీ-గో-రౌండ్ (ఎంజీఆర్‌) వ్యవస్థ ద్వారా సరఫరా అవుతుందని, తద్వారా దేశంలో తక్కువ ధరలకే విద్యుత్ సరఫరా అవుతుందని ఆ ప్రకటనలో పేర్కొంది. 

ఇదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లో రూ.600 కోట్ల విలువైన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఇసిఎల్) మూడు ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులను కూడా టెలికాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అలాగే ఆదివారం(ఫిబ్రవరి 25) గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తొలి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సహా ఐదు ఎయిమ్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వీటిలో మంగళగిరి (ఆంధ్రప్రదేశ్), భటిండా (పంజాబ్), రాయ్ బరేలీ (ఉత్తరప్రదేశ్), కళ్యాణి (పశ్చిమ బెంగాల్)లలో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్‌లు ఉన్నాయి. 

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top