కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించిన ప్రధాని మోదీ | PM Visit Landslide Hit Wayanad Updates | Sakshi
Sakshi News home page

కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Aug 10 2024 7:54 AM | Updated on Aug 10 2024 5:18 PM

PM Visit Landslide Hit Wayanad Updates

తిరువనంతపురం: 

కేరళలోని వయనాడ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  పర్యటన కొనసాగుతోంది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన  ప్రాంతాన్ని మోదీ సందర్శించారు. అక్కడ సాగుతున్న సహాయక చర్యలు, బాధితుల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

 కేరళలో కొండచరియలు విరిగిపడి వందల మంది ప్రాణాలు కోల్పోయిన వయనాడ్‌ ప్రాంతంలో ప్రధాని మోదీ శనివారం(ఆగస్టు10) పర్యటిస్తున్నారు. పర్యటన కోసం కేరళలోని కన్నూర్‌ విమానాశ్రయానికి  ఉదయం 11గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని చేరుకున్నారు. ఇక్కడి నుంచి వాయుసేన హెలికాప్టర్‌లో వయనాడ్‌ వెళ్లి ఏరియల్‌ సర్వే ద్వారా పరిస్థితిని పరిశీలించారు. 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement