నా మిత్రులకు ఆహారం తినిపించా | PM Narendra Modi reveals special morning routine, feeds peacocks, cows | Sakshi
Sakshi News home page

నా మిత్రులకు ఆహారం తినిపించా

Aug 17 2026 6:27 AM | Updated on Aug 17 2026 6:27 AM

PM Narendra Modi reveals special morning routine, feeds peacocks, cows

నెమళ్ల వీడియోను షేర్‌ చేసిన ప్రధానమంత్రి మోదీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు బయలుదేరే ముందు, దినచర్యలో భాగంగా ఆవులు, నెమళ్లకు మేత తినిపించిన వీడియోను ఆదివారం సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘ఉదయాన్నే నా మిత్రులకు మేత వేయడం నా దినచర్యలో ఒక భాగం. 

నిన్న ఉదయాన్నే నేను బయటకు వెళ్తున్నానని నా మిత్రులు గ్రహించినట్లున్నాయి. అందుకే ముందుగానే నా వద్దకు వచ్చాయి. ఎప్పటిలాగే ఇది చాలా ప్రత్యేకమైనది’ అని ఇన్‌స్టా గ్రామ్‌లో పేర్కొన్నారు. ఎర్రకోట వేడుకల కోసం సంప్రదాయ దుస్తులు ధరించి, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని ఏడో నంబర్‌ నివాసంలో ఆవులకు గడ్డి, నెమళ్లకు ధాన్యపు గింజలు అందిస్తూ అందులో ప్రధాని కనిపించారు. ఆ తర్వాత ఆయన ఎర్రకోటకు చేరుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement