
బన్స్వారా: ‘11 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు ఎలా ఉండేవో మీకు తెలుసు. పౌరులను దోపిడీ చేయడంలో కాంగ్రెస్ బిజీగా ఉండేది. వారు దేశ ప్రజలను దోచుకున్నారు. నాటి రోజుల్లో పన్నులు, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ దోపిడీని అడ్డుకుంది. వారి కోపానికి కారణం కూడా ఇదే. 2017లో మేము జీఎస్‌టీని తీసుకువచ్చాం. దేశాన్ని పన్నులు, టోల్ సంకెళ్ల నుండి విముక్తి చేశాం. ఇప్పుడు, నవరాత్రి తొలి రోజున జీఎస్‌టీ సంస్కరణలు అమలయ్యాయి. దేశం ‘జీఎస్‌టీ బచత్ ఉత్సవ్’ జరుపుకుంటోంది’ అని ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని బన్స్వారాలో జరిగిన బహిరంగ ర్యాలీలో పేర్కొన్నారు.
గురువారం రాజస్థాన్‌లో పర్యటించిన ప్రధానిమోదీ రూ.1,22,100 విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. బన్స్వారాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘విద్యుత్ ప్రాముఖ్యతను కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదు. 2014లో నాకు సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు, దేశంలో 2.5 కోట్ల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లేదు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా, 18 వేల గ్రామాలలో ఇప్పటికీ విద్యుత్ కనెక్షన్లు లేవు. ప్రధాన నగరాలు గంటల తరబడి విద్యుత్ కోతలను ఎదుర్కొన్నాయి. గ్రామాల్లో 4-5 గంటల విద్యుత్ సరఫరాతో రోజు గడిచేది. 2014లో మా ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించుకుంది. భారతదేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్ అందించాం. మేము 2.5 కోట్ల ఇళ్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. నవరాత్రులలోని 4వ రోజున మాతా త్రిపుర సుందరి భూమి అయిన బన్స్వరానికి వచ్చే అవకాశం లభించింది. అమ్మవారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను’ అని అన్నారు.
#WATCH | Rajasthan | Addressing a public rally in Banswara, PM Modi says, "... 2014 ke pehle ki baat kar raha hoon. Yeh jo Bayaan-bahadur bhanti bhanti ke jhooth phaila rahe hain. Congress Sarkar 100 rupay ki khareed pa 31 rupay tax leti thi..."
"You may remember, 11 years ago,… pic.twitter.com/69UqdS0P4W— ANI (@ANI) September 25, 2025
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2025ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో జరిగే ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 25 నుండి 29 వరకు జరగనుంది. దీనిలో ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక, వ్యవసాయ, సాంస్కృతిక, ఆవిష్కరణలు ప్రదర్శితం కానున్నాయి. అనంతరం ప్రధాని మోదీ రాజస్థాన్‌ను సందర్శించి, బన్స్వారాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. పీఎం కుసుమ్ లబ్ధిదారులతో కూడా ఆయన సంభాషించారు. రూ.42,000 కోట్ల విలువైన అణుశక్తి విద్యుత్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది దేశంలోని భారీ అణు విద్యుత్ కేంద్రాలలో ఒకటిగా నలిచిపోనుంది.