
ఆపరేషన్ సిందూర్ సమయంలో యుద్ధ విమానాల కూల్చివేతపై భారత వైమానిక దళం చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ స్పందించింది. భారత్ దాడిలో ఒక్క సైనిక విమానం కూడా ధ్వంసం కాలేదంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పుకొచ్చారు. భారత వైమానిక దళ చీఫ్ వాదనల్లో వాస్తవం లేదంటూ పాక్ మంత్రి కొట్టిపారేశారు.
కాగా, పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించామని.. పాక్‌కు చెందిన ఐదు ఫైటర్ జెట్‌లను, ఓ భారీ ఎయిక్రాఫ్ట్ మన సైన్యం కూల్చేసిందని ఏపీ సింగ్ అన్నారు. మన సైన్యం దాడి చేసిన పాక్ ప్రధాన ఎయిర్‌ఫీల్డ్‌లలో షహబాజ్ జకోబాబాద్ స్థావరం ఒకటి. అక్కడ ఎఫ్-16 హ్యాంగర్ ఉంది. మన సైన్యం దాడితో అది సగానికి పైగా దెబ్బతింది. అక్కడ కొన్ని యుద్ధ విమానాలు ఉన్నాయని, అవి తీవ్రంగా దెబ్బతిన్నాయని మేం అంచనాకు వచ్చాం. ఆపరేషన్ సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థ, ఎస్-400 క్షిపణి వ్యవస్థ సమర్థంగా పనిచేశాయి’’ అని అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు.