తిరువొత్తియూరు: కన్యాకుమారి జిల్లా కలియక్కావిలై దగ్గరలోని మెదుగుమ్మల్ ప్రాంతానికి చెందిన ఇవాంజెరీ (28), లాయర్ అయిన ఇతనిపై పలు కొట్లాట కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నెల క్రితం సాహినియా (25) అనే లాయర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొత్త వరుడు ఇవాంజెరీ, ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగను స్నేహితులతో కలిసి ఉత్సాహంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 24వ తేదీన స్నేహితులతో కుళిత్తురైలోని ఓ ప్రైవేట్ మద్యం బార్‌కు వెళ్లి మద్యం విందులో పాల్గొన్నారు.
అక్కడ అందరూ ఉత్సాహంగా మద్యం తాగారు. దీంతో మత్తులో ఉన్న ఇవాంజెరి మద్యం బార్ వెనుకకు వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న అతను అకస్మాత్తుగా తామ్రపరణి నదిలోకి దూకాడు. తర్వాత నీటిలో కొట్టుకుపోయాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన స్నేహితులు ఈ విషయాన్ని అగి్నమాపక కేంద్రానికి తెలియజేశారు. స్థానిక అగి్నమాపక సిబ్బంది శుక్రవారం సాయంత్రం ఓ ప్రాంతంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు.


