
నవసారి: దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు(Holi celebrations) అంబరాన్ని అంటుతున్నాయి. చిన్నాపెద్దా అంతా ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఆనందిస్తున్నారు. దేశంలో ఎక్కడైనా హోలీ వేడుకలు ఒకరోజు జరుగుతాయి. కానీ ఆ ప్రాంతంలో ఏకంగా 10 రోజుల పాటు హోలీ వేడుకలు కొనసాగుతాయి. గుజరాత్‌లోని ఆదివాసీ జనబాహుళ్యం కలిగిన డాంగ్ జిల్లాలో హోలీ ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.
డాంగ్ జిల్లాలో జరిగే హోలీని రాజుల హోలీ(Holi of the Kings)గా చెబుతారు. డాంగ్ జిల్లాలో నేటికీ ఐదుగురు రాజవంశస్థులు ఉన్నారు. ఏడాదిలో ఒకసారి ఈ రాజులను బహిరంగంగా గౌరవపూర్వకంగా సన్మానిస్తారు. పది రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనిని డాండ్ దర్బార్ మేళా అని అంటారు. ఈ ఉత్సవాల్లో ఆ రాజులను రథాలలో కూర్చోబెట్టి వేదిక దగ్గరకు తీసుకువచ్చి, ఘనంగా సన్మానిస్తారు. వీరికి ప్రభుత్వం ఫించను అందజేస్తుంది.
పది రోజుల పాటు జరిగే హోలీ వేడుకల్లో ప్రతీరోజూ ఇక్కడి ఆదివాసీ మహిళలు సాయంత్రం వేళల్లో జానపద గీతాలు ఆలపిస్తారు. అలాగే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతలోని చిన్నారులు తమ మేనమామలకు హోలీ స్నానం చేయిస్తారు. చిన్నారులను స్థానికులు భక్త ప్రహాదుని రూపాలుగా భావించి పూజలు చేస్తారు.
ఇది కూడా చదవండి: ‘27 ఏళ్లుగా హోలీ అన్నదేలేదు’.. ఓ పోలీసు ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment