‘కోల్‌కతాలో జరిగినట్లు...’ బాలికలను బెదిరించిన ఆటో డ్రైవర్‌ | Nagpur Auto Rickshaw Wala Viral Video | Sakshi
Sakshi News home page

‘కోల్‌కతాలో జరిగినట్లు...’ బాలికలను బెదిరించిన ఆటో డ్రైవర్‌

Aug 24 2024 10:34 AM | Updated on Aug 24 2024 10:43 AM

Nagpur Auto Rickshaw Wala Viral Video

దేశంలో తరచూ అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి సందర్భాల్లో జనం ఆగ్రహం వ్యక్తంచేస్తూ, నిందితులపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగిన ఒక ఉదంతం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మీడియాకు అందిన సమాచారం  ప్రకారం స్కూల్‌కు వెళుతున్న ఇద్దరు బాలికలను ఓ ఆటో డ్రైవర్ బెదిరించాడు. పైగా కోల్‌కతాలో ట్రైనీ మహిళా డాక్టర్‌కు జరిగినట్టే మీపైన కూడా దాడి చేస్తానని నిందితుడు బెదిరించాడని ఆ బాలికలు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ఆటో డ్రైవర్‌ను చావబాదడాన్ని వీడియోలో చూడవచ్చు. మరోవైపు కొందరు ఆ బాధిత బాలికలకు ధైర్యం చెప్పడం కూడా కనిపిస్తుంది. తరువాత బాధితురాలు ఆ నిందితుడిని చెప్పుతో కొట్టింది.

దీనికిముందు ఆటో డ్రైవర్‌ ఆ బాలికలను  వెనుక సీట్‌లో కూర్చోవాలని, బిగ్గరగా మాట్లాడవద్దని  హెచ్చరించాడు. ఈ నేపధ్యంలో ఆ బాలికలకు డ్రైవర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలోనే ఆ డ్రైవర్‌ కోల్‌కతా ఉదంతాన్ని గుర్తుచేస్తూ వారిని బెదిరించాడు. దీంతో ఆ బాలికలు  ఆటోను ఆపాలని  కేకలు పెట్టారు. దీనిని విన్న స్థానికులు ఆ  ఆటో డ్రైవర్‌ను ఆటోలో నుంచి బయటకు లాగి చావబాదారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement