బెంగళూరు: సాధారణంగా కోతులు పండ్లు, కూరగాయలు వంటి శాకాహారాన్ని భుజిస్తాయి. కానీ ఓ వానరానికి మాంసంపై మనసు పడింది. ఇంట్లోకి దూరి చికెన్, మటన్ వంటకాలను ఎత్తుకెళ్తోంది. రేవునగరి మంగళూరులో మణ్ణగుడ్డె ప్రాంతంలో ఇది జరుగుతోంది. ఓ ఇంటివారు వండుకున్న మాంసం, చేపల కూరను దొంగిలిస్తోంది.
నాన్ వెజ్‌ను ఇష్టపడే ఈ కోతి చేష్టలను తట్టుకోలేక బాధితుడు కాంత్‌రాజ్ అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రెండేళ్ల నుంచి ఈ కోతి తమ ఇంటిలోకి దూరి మాంసం వంటకాలను దొంగిలించి తింటోందంటూ, దాని బారి నుంచి కాపాడాలని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.


