వామ్మో ఎన్ని పేలో.. నేను తీసేస్తాలే | Monkey Cares For Lost Kitten At Dharur Bus Stand In Rare Act Of Compassion, Photo Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

వామ్మో ఎన్ని పేలో.. నేను తీసేస్తాలే

May 30 2026 10:57 AM | Updated on May 30 2026 12:07 PM

monkey mothers kitten in rare dharur incident

ఆర్థిక వ్యవహారాలు, ఆస్తుల గొడవల్లో రక్త బంధాలను సైతం లెక్కచేయని ప్రస్తుత కాలంలో.. నోరు లేని మూగజీవాలు ఇతర ప్రాణులపై వాత్సల్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. తల్లి కనిపించక మ్యావ్‌.. మ్యావ్‌.. అని అరుస్తూ ఓ పిల్లి పిల్ల శుక్రవారం ధారూరు బస్టాండ్‌లో తిరుగుతోంది. ఇది గమనించిన ఓ వానరం దాని వద్దకు చేరుకుని కొద్దిసేపు లాలించింది. నోటితో ఒడిసి పట్టుకుని ఠాణా ఎదురుగా ఉన్న భవనంపైకి చేరింది. తలపై పేలు చూస్తూ.. సరదగా ఆడిస్తూ, ముద్దు చేసింది. పిల్లి పిల్లను కోతి లాలించడం తామెప్పుడూ చూడలేదని స్థానికులు ఫొటోలు, వీడియోలు తీశారు.           


అరవకురా కన్నా.. నీకు నేనున్నా..  


ఇక్కడందరూ మనల్ని ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు.. పదా అటువైపు వెళ్లిపోదాం   

నీకేం భయం లేదు.. జాగ్రత్తగా రోడ్డు దాటిస్తా..   

  • వికారాబాద్‌ 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement