మంత్రి విశ్వనాథన్‌ స్టెప్పులు | స్టేజీపై ఉన్న టీవీకే మహిళా నేతలు, యువ కార్యకర్తలతో కలిసి మంత్రి విశ్వనాథన్‌ కూడా ఏమాత్రం మొహమాటపడకుండా ఊరమాస్‌ స్టెప్పులు వేశారు. ఆ రాష్ట్ర ఉన్నత విద్యను శాసించే స్థానంలో ఉన్న ఒక బాధ్యతాయుతమైన మంత్రి, ఇలా బహిరంగంగా సినిమా పాటకు స్టెప్పులు వేయడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. | Sakshi
Sakshi News home page

మంత్రి విశ్వనాథన్‌ స్టెప్పులు

Jun 22 2026 9:13 AM | Updated on Jun 22 2026 11:52 AM

Minister Viswanathan dances at a student marathon event,

సాక్షి, చెన్నై : మధురై మేలూర్‌ మారథాన్‌లో కాంగ్రెస్‌ మంత్రి మాస్‌ స్టెప్పుల  వీడియో వైరల్‌గా మారి  రాజకీయంగా దుమారం రేపింది. సీఎం విజయ్‌ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని  ఆదివారం మేలూరులో కార్యక్రమం జరిగింది.  రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి విశ్వనాథన్‌ అక్కడ ఉన్న యువత, కార్యకర్తలతో పాటుగా ఓ మహిళా కార్యకర్తతో కలిసి స్టెప్పులు అదరగొట్టారు.ఈ డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో విమర్శలతో వైరల్‌ అయింది. 

స్టేజీపై ఉన్న టీవీకే మహిళా నేతలు, యువ కార్యకర్తలతో కలిసి మంత్రి విశ్వనాథన్‌ కూడా ఏమాత్రం మొహమాటపడకుండా ఊరమాస్‌ స్టెప్పులు వేశారు. ఆ రాష్ట్ర ఉన్నత విద్యను శాసించే స్థానంలో ఉన్న ఒక బాధ్యతాయుతమైన మంత్రి, ఇలా బహిరంగంగా సినిమా పాటకు  స్టెప్పులు వేయడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీంతో  మంత్రి విశ్వనాథన్‌  వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 

తమిళనాడు సీఎం విజయ్,  లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పుట్టినరోజుల సందర్భంగా మధురై జిల్లా మేలూర్‌లో ‘డ్రగ్స్‌ రహిత మేలూర్‌ – మహిళల రక్షణ’ అనే నినాదంతో ఒక భారీ అవేర్‌నెస్‌ మారథాన్‌  పోటీని నిర్వహించామన్నారు.  టీవీకే,  కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న యువత తనను వారితోపాటుగా  డ్యాన్స్‌ చేయమని కోరగా,  వారి ఉత్సాహాన్ని  కాదనలేకపోయానని,  పండుగ వాతావరణంలో జరిగిన ఈ ఘటనను కొందరు రాజకీయం చేయడం సరికాదన్నారు.   

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement