సొంతూరు దగ్గర్లో నీట్‌–పీజీ పరీక్ష  | Many reforms in NEET-PG exam pattern | Sakshi
Sakshi News home page

సొంతూరు దగ్గర్లో నీట్‌–పీజీ పరీక్ష 

Aug 2 2026 5:39 AM | Updated on Aug 2 2026 5:39 AM

Many reforms in NEET-PG exam pattern

పరీక్ష కేంద్రం ఎక్కడో 3 వారాల ముందే సమాచారం 

ఒక్కో ప్రశ్నకు సమాధానం రాసే గడువు పెంపు 

పరీక్షార్థులకు పలు వెసులుబాట్లు 

నీట్‌–పీజీ పరీక్ష విధానంలో పలు సంస్కరణలు

న్యూఢిల్లీ: యువతరం నీట్‌ లీకేజీ వ్యతిరేక ఉద్యమంతో పరీక్షల విధానంలో సంస్కరణలు తెస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్‌డీఏ సర్కార్‌ ఆ దిశగా పరీక్షార్థులకు అనువుగా పలు వెసులుబాట్లు కల్పించనుంది. ఈ ఏడాది చివర్లో జరగబోయే కీలకమైన నీట్‌–పీజీ పరీక్ష రాయబోయే అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల ఎంపికలో ఎక్కువ ఆప్షన్లను అందించనుంది. 

దీంతో పరీక్షార్థులు తమ సొంతూరు/ఉంటున్న నగరం సమీపంలో ఎగ్జామ్‌ సెంటర్‌ను ఎంచుకునే అవకాశాలు మెరుగయ్యాయి. పరీక్ష కేంద్రం ఎక్కడ కన్‌ఫర్మ్‌ అయిందనే వివరాలను 3 వారాల ముందుగానే పరీక్షారి్థకి తెలియజేస్తారు. దీంతో ఎగ్జామ్‌ సెంటర్‌ ఉన్న ప్రాంతానికి పక్కా ప్రణాళికతో ముందస్తు షెడ్యూల్‌ చేసుకునేందుకు అవకాశం చిక్కనుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. 

‘‘ప్రశ్నాపత్రం కోసం విషయ నిపుణుల నుంచి ప్రశ్నల సేకరణ, వాటి వడబోత, ఎంపిక చేసిన ప్రశ్నలతో ప్రశ్నలనిధి తయారీ, క్వశ్చన్‌ పేపర్‌ కూర్పు, ప్రూఫ్‌ రీడింగ్, అవసరమైతే ఇతర బాషల్లోకి అనువాదం, పలు పేపర్ల నుంచి ఒక్క పేపర్‌ను చివరి నిమిషంలో ఎంపికచేసి ప్రింటింగ్, రవాణా దాకా అన్ని దశల్లో భద్రతకు పెద్దపీట వేస్తున్నాం. ఈసారి ఎగ్జామ్‌కు దరఖాస్తు దశలో, ఎగ్జామ్‌ రోజు ఆధార్‌ ఆధారిత అథంటికేషన్‌ ధృవీకరణ తీసుకుంటాం. 

వేలిముద్ర సరిపోలకపోతే ఐరిష్‌ బయోమెట్రిక్‌ తీసుకుంటాం. గతంలో తొలుత దరఖాస్తు చేసిన వాళ్లకే నచ్చిన/సమీప ఎగ్జామ్‌ సెంటర్‌ దక్కే అవకాశాలుండేవి. ఆలస్యంగా అప్లై చేస్తే ఇతర రాష్ట్రాల్లో లేదా సుదూర సెంటర్‌లో పరీక్ష రాయాల్సివచ్చేది. ఈసారి మూడు ఆప్షన్లు ఇస్తున్నాం. దీంతో ఆలస్యంగా దరఖాస్తు చేసినా సరే సొంత రాష్ట్రం, సొంత నగరాన్ని సైతం ఎంచుకున్న వాళ్లకూ ప్రాధాన్యత దక్కుతుంది. గతంలో 200 బహుళైశి్చక ప్రశ్నలుండేవి. ఈసారి 180 ప్రశ్నలకు 210 నిమిషాల గడువు ఉంటుంది’’ అని ఆరోగ్య శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement