
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’లో భారత సైనికులు చూపిన శౌర్యపరాక్రమాలు యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్(Mann Ki Baat)’ 122వ ఎపిసోడ్(మే 25)లో ప్రధాని నరేంద్ర మోదీ తన మసుసులోని మాటను వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలిచిందని, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో మన దళాలు ప్రదర్శించిన ధైర్యం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి ‘ఆపరేషన్ సిందూర్’ కొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) దేశ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసిందని, పలు కుటుంబాలు దీనిని తమ జీవితంలో భాగంగా చేసుకున్నారని అన్నారు. ప్రతి భారతీయుని సంకల్పం ఉగ్రవాదాన్ని నిర్మూలించడమేనని అన్నారు. సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలను మన దళాలు ధ్వంసం చేశాయన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమయ్యాక దేశంలోని పలు ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు నిర్వహించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం బీహార్‌లోని కతిహార్, యూపీలోని కుషినగర్ తదితర ప్రాంతాల్లో జన్మించిన చిన్నారులకు ‘సిందూర్’ అనే పేరు పెట్టారని అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక జారీ చేశారు. ఈ దారుణ చర్యకు పాల్పడినవారు, కుట్రదారులకు కఠినమైన ప్రతిస్పందన ఎదురవుతుందని హెచ్చరించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి ప్రతి పౌరుడిని కలచివేసిందన్నారు.

ఉగ్రవాదంపై జరిగిన ఈ యుద్ధానికి దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు సంఘీభావం ప్రకటించారని ప్రధాని గుర్తుచేశారు. కాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని కటేఝరి గ్రామానికి బస్సు రాకతో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారన్నారు. ఈ గ్రామం మావోయిస్టుల హింసకు గురైందని, గ్రామానికి తొలిసారిగా బస్సు చేరుకున్నప్పుడు ఘనంగా స్వాగతించారని అన్నారు. గత మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ భారత స్వాతంత్ర్య పోరాటంలో ఏప్రిల్, మే నెలల ప్రాముఖ్యతను తెలియజెప్పారు. నాటి స్వాతంత్ర్య సమరయోధులు(Freedom fighters) చేసిన త్యాగాలను వివరించారు.
ఇది కూడా చదవండి: Happy Africa Day: మూడొంతుల భాషలు ఇక్కడివే..