breaking news
Radio Programme
-
‘ఆపరేషన్ సింధూర్’ గర్వకారణం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’లో భారత సైనికులు చూపిన శౌర్యపరాక్రమాలు యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్(Mann Ki Baat)’ 122వ ఎపిసోడ్(మే 25)లో ప్రధాని నరేంద్ర మోదీ తన మసుసులోని మాటను వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలిచిందని, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో మన దళాలు ప్రదర్శించిన ధైర్యం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందన్నారు.ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి ‘ఆపరేషన్ సిందూర్’ కొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) దేశ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసిందని, పలు కుటుంబాలు దీనిని తమ జీవితంలో భాగంగా చేసుకున్నారని అన్నారు. ప్రతి భారతీయుని సంకల్పం ఉగ్రవాదాన్ని నిర్మూలించడమేనని అన్నారు. సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలను మన దళాలు ధ్వంసం చేశాయన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమయ్యాక దేశంలోని పలు ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు నిర్వహించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఆపరేషన్ సిందూర్ అనంతరం బీహార్‌లోని కతిహార్, యూపీలోని కుషినగర్ తదితర ప్రాంతాల్లో జన్మించిన చిన్నారులకు ‘సిందూర్’ అనే పేరు పెట్టారని అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక జారీ చేశారు. ఈ దారుణ చర్యకు పాల్పడినవారు, కుట్రదారులకు కఠినమైన ప్రతిస్పందన ఎదురవుతుందని హెచ్చరించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి ప్రతి పౌరుడిని కలచివేసిందన్నారు.ఉగ్రవాదంపై జరిగిన ఈ యుద్ధానికి దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు సంఘీభావం ప్రకటించారని ప్రధాని గుర్తుచేశారు. కాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని కటేఝరి గ్రామానికి బస్సు రాకతో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారన్నారు. ఈ గ్రామం మావోయిస్టుల హింసకు గురైందని, గ్రామానికి తొలిసారిగా బస్సు చేరుకున్నప్పుడు ఘనంగా స్వాగతించారని అన్నారు. గత మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ భారత స్వాతంత్ర్య పోరాటంలో ఏప్రిల్, మే నెలల ప్రాముఖ్యతను తెలియజెప్పారు. నాటి స్వాతంత్ర్య సమరయోధులు(Freedom fighters) చేసిన త్యాగాలను వివరించారు.ఇది కూడా చదవండి: Happy Africa Day: మూడొంతుల భాషలు ఇక్కడివే.. -
మన్‌కీ బాత్ కోసం రేడియో ఎంచుకోవడానికి కారణమిదే!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం నేటికి 50 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘మీరెందుకు మన్ కీ బాత్ కార్యక్రమం కోసం రేడియోను ఎంచుకున్నారు. అది అంత పాపులర్ కాదు కదా’ అని తనను చాలామంది అడిగారని, దానికి తాను ‘1998లో నేనొక సామాన్య బీజేపీ కార్యకర్తగా ఉన్నపుడు, ఓ టీ కొట్టు దగ్గర టీ కోసం ఆగితే ఆ వ్యక్తి రేడియో ద్వారా అటల్ బిహారీ వాజ్‌పేయి తీసుకున్న న్యూక్లియర్ బాంబ్ నిర్ణయం గురించి వినడం చూశాను. అప్పటినుంచి రేడియో అనేది ఒక శక్తివంతమైన మాధ్యమమని తెలుసుకున్నాను’ అని తెలిపారు. అందుకే ప్రధాన మంత్రి అయ్యాక రేడియో ద్వారా మన్‌కీ బాత్ నిర్వహిస్తున్నానని చెప్పారు. తాజాగా ఆకాశవాణి సంస్థ నిర్వహించిన సర్వేలో మన్‌కీ బాత్ వల్ల దేశంలో సానుకూల ధోరణి పెరిగిందని, స్వచ్ఛందంగా సమాజ సేవకు పౌరులు ముందుకు వస్తున్నారని తెలిపారు. మన్‌కీ బాత్‌ను రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు కదా అన్న ప్రశ్నకు.. నేను ఈ రోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు. కానీ దేశంలో ప్రజాస్వామ్యం ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే మన్‌కీ బాత్‌ను రాజకీయాల కోసం ఉపయోగించకూడదనుకున్నానని మోదీ బదులిచ్చారు. మన్‌కీబాత్ కోసం మీరు ఎంత సమయం ప్రిపేర్ అవుతారన్న ప్రశ్నకు దీనికై ప్రత్యేకంగా సమాయత్తం కానని, మనసులో మాటే కాబట్టి చాలా సులువుగా చెప్పేస్తానని తెలిపారు. తాను ప్రయాణాలు చేసే సమయంలో భారత ప్రజలు పంపిన ప్రతిస్పందనలు, వాయిస్ మెసేజ్‌లను వింటానని తద్వారా ప్రజల ఆకాంక్షలను తెలుసుకోగలుగుతున్నానని అన్నారు. ప్రజలంతా తమ స్థానిక భాషల్లో మన్‌కీ బాత్‌ను వినాల్సిందిగా కోరారు. మన్‌కీ బాత్ ద్వారా పిలుపునిచ్చిన పరిసరాల పరిశుభ్రత, రోడ్డు భద్రత, డ్రగ్ ఫ్రీ ఇండియా, సెల్ఫీ విత్ డాటర్ వంటివి ప్రజల్లోకి బాగా వెళ్లాయన్నారు. యువత దృష్టికోణం నుంచే తాను ఆలోచిస్తానని అందుకే వారితో తొందరగా కలిసిపోతానని అన్నారు. పిల్లలకు పెద్దలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలని సూచించారు. యువత నుంచి తాను చాలా విషయాలు నేర్చుకుంటానని అన్నారు. యువతను ప్రశ్నలను అడగనివ్వాలని.. అప్పుడే సమస్యను వేర్ల వరకు తెలుసుకోగలమని అన్నారు. యువతకు ఓపిక తక్కువని చాలామంది అంటారని కానీ, యువత ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయాలనుకుంటారని, అది వారిలోని మల్టీటాస్కింగ్ పవర్‌కు నిదర్శమని కొనియడారు. ఎక్కువగా ఆలోచించి, ఎక్కువగా పని చేసేవారే ఎక్కువ ఎత్తుకు చేరుకుంటారని అన్నారు. 1949 నవంబర్ 26న మనం రాజ్యాంగాన్ని స్వీకరించామని, ఈ సందర్భంగా లక్షలాది మందికి ఆత్మగౌరవాన్ని అందించిన బాబా సాహెబ్ అంబేద్కర్‌ను గుర్తుచేసుకోవాలని సూచించారు. అంబేద్కర్ భారత రాజ్యాంగానికి చేసిన కృషి ఎనలేనిదని చెప్పారు. నవంబర్ 23న గురునానక్ జయంతిని జరుపుకుంటామని, ఆయన ఆదర్శాలను అందరూ పుణికిపుచ్చుకోవాలని అన్నారు. వచ్చే సంవత్సరం గురునానక్ 550వ జయంతిని ఘనంగా జరుపుకోనున్నామని చెప్పారు. -
'నల్లధనం వెలికితీతలో మమ్మల్ని విశ్వసించండి'
-
'నల్లధనం వెలికితీతలో మమ్మల్ని విశ్వసించండి'
న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీతలో తమ ప్రభుత్వాన్ని విశ్వసించాలని ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణీలో ఆదివారం ఉదయం రెండోవిడత నిర్వహించిన మాన్‌కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ... ఎన్నిక సమయంలో దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛభారత్ నిర్మాణం తమ ప్రభుత్వ ప్రధాన అంశమని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం శుభపరిణామమన్నారు. చిన్నారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అనార్యోగం దరి చేరకుండా ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని ఆయన ప్రజలుకు విజ్ఞప్తి చేశారు. యువభారత్ ఏదైనా సాధించగలదు మోదీ పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు ఉపకార వేతనాలు అందజేస్తామని తెలిపారు. అందుకోసం చర్యలు చేపట్టినట్లు వివరించారు. దేశ రక్షణ కోసం పాటు పడుతున్న జవాన్లకు మోడీ ఈ సందర్భంగా మరోసారి సలాం చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఉత్తరాల ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చంటూ మోదీ ఈ సందర్బంగా ప్రజలకు తెలిపారు. దేశానికి సేవ చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మోదీ స్పష్టం చేశారు.