తమిళనాడు కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు | Manickam Tagore appointed TNCC president details inside | Sakshi
Sakshi News home page

టీఎన్‌సీసీ నూత‌న అధ్యక్షుడిగా మాణిక్యం ఠాగూర్

Jun 27 2026 6:52 PM | Updated on Jun 27 2026 7:03 PM

Manickam Tagore appointed TNCC president details inside

చెన్నై: తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) నూత‌న అధ్యక్షుడిగా సీనియ‌ర్ నాయ‌కుడు మాణిక్యం ఠాగూర్(51) నియ‌మితుల‌య్యారు. ఇప్ప‌టివ‌ర‌కు అధ్యక్షుడిగా ఉన్న కె. సెల్వపెరుంతగై త‌న‌ను టీఎన్‌సీసీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాల‌ని కోర‌డంతో పార్టీ అధిష్టానం మాణికం ఠాగూర్‌ను కొత్త అధ్యక్షుడిగా నియమించింది. ప్ర‌స్తుతం ఆయ‌న విరుధునగర్ లోక్‌స‌భ‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

త‌మిళ‌నాడులో డీఎంకే కూట‌మి నుంచి కాంగ్రెస్ వైదొల‌గిన నేప‌థ్యంలో మాణికం ఠాగూర్ నియామ‌కం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. త‌మిళ‌నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయ‌న జాతీయ స్థాయిలోనూ ప‌లు ర‌కాల బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయ‌న‌ను టీఎన్‌సీసీ నూత‌న అధ్యక్షుడిగా నియ‌మించడం ద్వారా పార్టీని  మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్ హైక‌మాండ్ భావిస్తోంది.

విద్యార్థి దశ నుంచే రాజకీయాలు
1975 జూన్ 1న శివగంగైలో జన్మించిన మాణికం ఠాగోర్, బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి బీఏ-ఎల్ఎల్బీ పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్న ఆయన, 1994లో NSUI జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.

తర్వాత 1996లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1997లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 1999లో జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎదిగారు. 2003 నుంచి 2005 వరకు ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన, 2006లో కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌గా, 2008లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎన్నికల కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 

2009లో తొలిసారిగా లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. పార్లమెంట్ ప‌లు స్థాయి సంఘాల్లో స‌భ్యుడిగా ఉన్నారు. 2013 నుంచి 2016 వ‌ర‌కు పార్టీ త‌ర‌పున ప‌లు రాష్ట్రాల్లో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. 2017 నుంచి దాదాపు మూడేళ్ల పాటు ఏఐసీసీ కార్య‌ద‌ర్శి హోదాలో కర్ణాట‌క కాంగ్రెస్ ఇంచార్జిగా వ్య‌వ‌హ‌రించారు. 2019లో రెండోసారి ఎంపీగా గెలిచారు. 2020 నుంచి దాదాపు మూడేళ్ల పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 

చ‌ద‌వండి: 'బ్రాండ్ మోదీ'పై ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కుమార్తె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement