సీఈసీ రాజీనామా, సర్‌ రద్దు  | Mallikarjun Kharge reiterated three demands amid the SIR row | Sakshi
Sakshi News home page

సీఈసీ రాజీనామా, సర్‌ రద్దు 

Oct 6 2026 6:25 AM | Updated on Oct 6 2026 6:25 AM

Mallikarjun Kharge reiterated three demands amid the SIR row

బ్యాలెట్‌ విధానంలో మళ్లీ ఎన్నికలు 

ఈ మూడు డిమాండ్లపై రాజీపడబోమన్న కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన మూడు అంశాలపై తమ వైఖరి స్పష్టమని కాంగ్రెస్‌ వెల్లడించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా, ఓటరు జాబితా సర్‌ రద్దు, ఎన్నికలను తిరిగి బ్యాలెట్‌ విధానంలో నిర్వహించాలన్న డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొట్టింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం ‘ఎక్స్‌’లో ఈ మేరకు పోస్ట్‌ చేశారు. 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఈ డిమాండ్ల సాధనకు ఇప్పటికే ఆందోళనలు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై వివిధ ప్రాంతాల్లో పోరాటం చేస్తున్న పౌరసంఘాలు, యువతకు తమ మద్దతు ఉంటుందని ఖర్గే వెల్లడించారు. అదే సమయంలో ఢిల్లీలో మహిళా జర్నలిస్టులతో బీజేపీ వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళా పాత్రికేయులపై వేధింపులకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అధికార పక్షం మరో అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement