మహువా పిటిషన్‌: లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సుప్రీం కోర్టు నోటీసు | Sakshi
Sakshi News home page

మహువా పిటిషన్‌: లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సుప్రీం కోర్టు నోటీసు

Published Wed, Jan 3 2024 4:20 PM

Mahua Moitras expulsion:SC Issues Notice To Lok Sabha Secretary General - Sakshi

ఢిల్లీ​: పార్లమెంట్‌లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరించబడిన విషయం తెలిసందే. లోక్‌సభ నుంచి తనను బహిష్కరించిన విషయంలో ఆమె సూప్రీం కోర్టును ఆశ్రయించారు. బుధవారం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా .. లోక్‌ సభ మహువా మొయిత్రిపై వేసిన సస్పెన్షన్‌ వేటుకు సంబంధించి స్టే ఇవ్వాలన్న ఆమె పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. 

మహువా మోయిత్రా వేసిన పిటిషన్‌పై రెండు వారాల్లోగా పూర్తి సమాధానం అందించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటిసు ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ మార్చి మూడో వారానికి వాయిదా చేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది.

డిసెంబర్‌లో జరిగిన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రాను ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఆధారంగా ఎంపీగా కొనసాగకూడదని లోక్‌ సభ సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో ఆమె ప్రవర్తన అనైతికమని ఎథిక్స్‌ కమిటీ తేల్చి చేప్పింది. కాగా.. తనను ఎంపీగా  సస్పెండ్‌పై చేయడంపై మహువా సుప్రీం కోర్టులో పిటిషన్‌ ఫైల్‌ చేసిన విషయం తెలిసిందే. 

చదవండి: మీతోనే ఉంటానంటూ శివరాజ్‌ సింగ్‌ భావోద్వేగం

Advertisement
 
Advertisement
 
Advertisement