మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 150 సీట్లు

Madhya Pradesh Assembly Election 2024: Congress will win 150 seats - Sakshi

రాబోయే ఎన్నికల్లో అధికారం మాదే

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధీమా 

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో శాసనసభలో 230 సీట్లకు గాను రాబోయే ఎన్నికల్లో తాము 150 సీట్లు కచ్చితంగా గెలుచుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారం తమదేనని తేల్చిచెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సోమవారం ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో మధ్యప్రదేశ్‌ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల సన్నద్ధతపై విస్తృతంగా చర్చించారు.

ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటినుంచే కష్టపడి పనిచేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. భేటీ అనంతరం రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని, మధ్యప్రదేశ్‌లోనూ అదే పరంపర కొనసాగిస్తామని చెప్పారు. కర్ణాటక ఫలితమే మధ్యప్రదేశ్‌లో పునరావృతం అవుతుందన్నారు. రాష్ట్రంలో 150 సీట్లు గెలుచుకోబోతున్నట్లు తమ అంతర్గత అధ్యయనంలో వెల్లడయ్యిందని వివరించారు. రాష్ట్రంలో 4 నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.   
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top