లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్‌ | Lok Sabha Speaker Om Birla Tested Positive In Delhi | Sakshi
Sakshi News home page

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్‌

Mar 21 2021 2:57 PM | Updated on Mar 21 2021 3:58 PM

Lok Sabha Speaker Om Birla Tested Positive In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ కలవరపెడుతోంది. పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా మహమ్మారి సోకడంతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

ఓం బిర్లాకు చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.  ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ బడ్జెట్ సమావేశాల్లో ఓం బిర్లా పాల్గొన్న విషయం తెలిసిందే.  స్పీకర్ స్థాయిలో ఉన్న ఆయనకు కరోనా సోకడంతో పలువురు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: ముఖ్యమంత్రి తనయుడికి పాజిటివ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement