బీహార్‌లో పిడుగుల వాన.. 13 మంది మృతి | Lightning Strikes Four Districts Of Bihar | Sakshi
Sakshi News home page

బీహార్‌లో పిడుగుల వాన.. 13 మంది మృతి

Apr 9 2025 9:39 PM | Updated on Apr 9 2025 9:44 PM

Lightning Strikes Four Districts Of Bihar

బీహార్‌లో పలు జిల్లాలను ఈదురు గాలులు, వడగళ్ల వానలు అతలాకుతలం చేశాయి. బుధవారం ఉదయం రాష్ట్రంలోని బెగుసరాయ్, దర్భంగా, మధుబని, సమస్తిపూర్‌లలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మధుబని జిల్లాలోని పిప్రౌలియా గ్రామంలో ముగ్గురు మృతి చెందగా, ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె ఉన్నారు. సమస్తిపుర్‌లో ఓ వ్యక్తి పిడుగుపాటు వల్ల చనిపోయినట్లు సీఎంవో కార్యాలయం వెల్లడించింది.

బాధిత కుటుంబాలకు సీఎం నీతీష్‌ కుమార్‌ రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 13 మంది మరణించడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

 

 


 

Advertisement
 
Advertisement
Advertisement