నిద్రతో పేగుబంధం | Lack of sleep profoundly disrupts gut function | Sakshi
Sakshi News home page

నిద్రతో పేగుబంధం

Jun 7 2026 1:31 AM | Updated on Jun 7 2026 1:31 AM

Lack of sleep profoundly disrupts gut function

నిద్ర పోకపోతే పొట్ట పనిచేయదు!

మెరుగైన జీర్ణ క్రియతోనే ఆరోగ్యకర జీవనం సాధ్యం

పేగు ఆరోగ్యంలో సమస్యలు తలెత్తితే ఈ ప్రక్రియలో అవరోధాలు

మంచినిద్ర లేకపోతే పొట్ట పనిచేయదు... నిజమే నిద్రకు, పేగు ఆరోగ్యా­నికి మధ్య సంబంధం ఉంది. దీన్ని గట్‌–స్లీప్‌ యాక్సిస్‌ అంటారు. పేగు­లోని బ్యాక్టీరియా మనం నిద్రపోవడానికి అనువైన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. సుఖ నిద్రతో దేహంలోని మైక్రోబయోమ్‌ యంత్రాంగం చక్కగా పనిచేసి దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అమెరికాకు చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ ఇన్‌ఫర్మేషన్‌ (ఎన్‌సీబీఐ) ప్రకారం మంచి నిద్ర–జీర్ణకోశ ఆరోగ్యం పరస్పర ఆధారితాలు.

యంత్రం పనిచేయాలంటే..
మన జీర్ణ వ్యవస్థలో సూక్ష్మజీవులు నివసిస్తాయి. ఆ సముదాయాన్ని, వాటి జన్యు పదార్థం, ఫంగస్‌లను మైక్రోబయోమ్‌ అంటారు. ఇది జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి దోహదం చేస్తూ మనిషి ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడుతుంది. ఈ మైక్రోబయోమ్‌ చక్రం సవ్యంగా సాగాలంటే మంచి నిద్ర అవసరం.

మంచినిద్ర లేకపోతే...
పేగులో ఉండే ప్రో–బ్యాక్టీరియా (దేహానికి ప్రయోజనకారి) వృద్ధి తగ్గుతుంది. ప్రో–బ్యాక్టీరియా వృద్ధి తగ్గిందంటే హానికారక బ్యాక్టీరియా వృద్ధిపై నియంత్రణ లేకపోవడంతో ఆ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఈ స్థితిని డిస్‌బయోసిస్‌ అంటారు.
 గాఢనిద్రలో ఉన్నప్పుడు విడుదల కావాల్సిన గ్రెలిన్, లెప్టిన్‌ హార్మోన్ల సమతుల్యత నిద్రలేమి కారణంగా దెబ్బతింటుంది.
జీవక్రియలు మందగించడం ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌కు దారితీస్తుంది.

శరీరంలో ఉత్పత్తి అయ్యే 90% సెరోటోనిన్‌ హార్మోన్‌ పేగులోనే ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్‌ న్యూరో ట్రాన్స్‌మీటర్‌గా పనిచేస్తుంది. మానసిక స్థితి, నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇది మెలటోనిన్‌ హార్మోన్‌కు ముందస్తు దశగా చెప్పవచ్చు. నిద్రపట్టడం, మెలకువ రావడం అనే ప్రక్రియలను మెలటో­నిన్‌ నియంత్రిస్తుంది. పేగు ఆరోగ్యం సరిగా లేకపోతే ఈ ప్రక్రియలో అవరోధాలు ఏర్పడతాయి. అంటే మనం మంచిగా నిద్రపోతేనే జీర్ణవ్యవస్థ తన పనిని చక్కగా నిర్వర్తిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేస్తేనే నిద్ర పడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement