లా కాలేజీ విద్యార్థినిపై దాష్టీకం సీసీ కెమెరాలో రికార్డు | Kolkata law college student | Sakshi
Sakshi News home page

లా కాలేజీ విద్యార్థినిపై దాష్టీకం సీసీ కెమెరాలో రికార్డు

Jun 30 2025 2:23 PM | Updated on Jun 30 2025 3:53 PM

Kolkata law college student

కోల్‌కతా: సౌత్‌ కోల్‌కతా లా కాలేజీలో విద్యార్థిపై గ్యాంగ్‌రేప్‌ ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. ఘటన చోటుచేసుకున్న జూన్‌ 25వ తేదీనాటి సీసీటీవీ ఫుటేజీలో ఫస్టియర్‌ చదివే విద్యారి్థనిని కొందరు సెక్యూరిటీ గార్డు రూంలోకి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. అందులో బాధితురాలు, ముగ్గురు నిందితుడు, సెక్యూరిటీ గార్డు కనిపించారన్నారు. అక్కడి స్టూడెంట్స్‌ యూనియన్‌ గది, వాష్‌రూంలో వెంట్రుకలు, హాకీ స్టిక్‌ను, గుర్తు తెలియని ద్రావకం కలిగిన కొన్ని బాటిళ్లను స్వా«దీనం చేసుకున్నట్లు చెప్పారు. 

గార్డు రూం, స్టూడెంట్స్‌ యూనియన్‌ గది, వాష్‌ రూంలలో పెనుగులాట చోటుచేసుకున్నట్లు ఆనవాళ్లున్నాయని వివరించారు. నమూనాలను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపినట్లు తెలిపారు. బాధితురాలి ముఖం, మెడపై గీసుకుపోయినట్లు, ఛాతీపై కొన్ని గుర్తులు ఉన్నాయని వివరించారు. ప్రధాన నిందితుడు కాలేజీ మాజీ విద్యార్థి, టీఎంసీ విద్యార్థి నేత మోనోజిత్‌ మిశ్రాతోపాటు మరో ఇద్దరు విద్యార్థులను, కాలేజీ వాచ్‌మ్యాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఇలా ఉండగా, ఘటన చోటుచేసుకున్న లా కాలేజీకి ఆదివారం జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ)సభ్యురాలు అర్చనా మజుందార్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థినిపై జరిగిన దారుణంపై దర్యాప్తు చేయకుండా పోలీసులు తనకు ఆటంకం కలిగించారని అనంతరం మజుందార్‌ ఆరోపించారు. ఘటనాప్రాంతంలో ఫొటోలు, వీడియోలు నిషేధించినట్లు చెప్పారన్నారు. కాగా, ఘటనపై దర్యాప్తునకు అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయి పోలీసు అధికారి సారథ్యంలో ఐదుగురు సభ్యుల సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెల్సిందే.   

Advertisement
 
Advertisement
Advertisement