breaking news
Law College students
-
లా కాలేజీ విద్యార్థినిపై దాష్టీకం సీసీ కెమెరాలో రికార్డు
కోల్‌కతా: సౌత్ కోల్‌కతా లా కాలేజీలో విద్యార్థిపై గ్యాంగ్‌రేప్ ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. ఘటన చోటుచేసుకున్న జూన్ 25వ తేదీనాటి సీసీటీవీ ఫుటేజీలో ఫస్టియర్ చదివే విద్యారి్థనిని కొందరు సెక్యూరిటీ గార్డు రూంలోకి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. అందులో బాధితురాలు, ముగ్గురు నిందితుడు, సెక్యూరిటీ గార్డు కనిపించారన్నారు. అక్కడి స్టూడెంట్స్ యూనియన్ గది, వాష్‌రూంలో వెంట్రుకలు, హాకీ స్టిక్‌ను, గుర్తు తెలియని ద్రావకం కలిగిన కొన్ని బాటిళ్లను స్వా«దీనం చేసుకున్నట్లు చెప్పారు. గార్డు రూం, స్టూడెంట్స్ యూనియన్ గది, వాష్ రూంలలో పెనుగులాట చోటుచేసుకున్నట్లు ఆనవాళ్లున్నాయని వివరించారు. నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు తెలిపారు. బాధితురాలి ముఖం, మెడపై గీసుకుపోయినట్లు, ఛాతీపై కొన్ని గుర్తులు ఉన్నాయని వివరించారు. ప్రధాన నిందితుడు కాలేజీ మాజీ విద్యార్థి, టీఎంసీ విద్యార్థి నేత మోనోజిత్ మిశ్రాతోపాటు మరో ఇద్దరు విద్యార్థులను, కాలేజీ వాచ్‌మ్యాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా ఉండగా, ఘటన చోటుచేసుకున్న లా కాలేజీకి ఆదివారం జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ)సభ్యురాలు అర్చనా మజుందార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థినిపై జరిగిన దారుణంపై దర్యాప్తు చేయకుండా పోలీసులు తనకు ఆటంకం కలిగించారని అనంతరం మజుందార్ ఆరోపించారు. ఘటనాప్రాంతంలో ఫొటోలు, వీడియోలు నిషేధించినట్లు చెప్పారన్నారు. కాగా, ఘటనపై దర్యాప్తునకు అసిస్టెంట్ కమిషనర్ స్థాయి పోలీసు అధికారి సారథ్యంలో ఐదుగురు సభ్యుల సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెల్సిందే. -
కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు
కోల్‌కతా: దేశమంతటా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ కాలేజీ మెడికోపై హత్యాచార ఘటనను మరవకముందే కోల్‌కతాలో అలాంటిదే మరో దారుణం జరిగింది. సౌత్ కలకత్తా లా కాలేజీ విద్యార్థిపై కాలేజీలోనే అత్యాచారం జరిగింది. అదే కాలేజీకి చెందిన మాజీ విద్యార్థి ఇద్దరు ప్రస్తుత విద్యార్థులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షకు సంబంధించిన పత్రాలను నింపేందుకు బాధితురాలు (24) బుధవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్లింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు. సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్‌కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు. మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు. నా బోయ్‌ఫ్రెండ్‌కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు. గది బయట కాపలాగా ఉన్నారు’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ముగ్గురు నిందితులకు కోర్టు ఐదు రోజుల రిమాండ్ విధించింది. ప్రధాన నిందితునికి సహకరించడం కూడా అత్యాచారానికి పాల్పడటంతో సమానమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ‘‘బాధితురాలు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలమిచ్చింది. ఘటన జరిగిన గార్డు గదితోపాటు పక్కనే ఉన్న విద్యార్థి సంఘం గదిని సీజ్ చేసి, ప్రత్యక్ష సాక్షులను విచారించాం’’ అని పోలీసులు తెలిపారు.అతనో క్రిమినల్ లాయర్ ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా అదే లా కాలేజీలో చదివాడు. 45 రోజుల కాంట్రాక్టుపై ప్రస్తుతం కాలేజీలో బోధనేతర విధుల్లో పనిచేస్తున్నాడని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నైనా చటర్జీ చెప్పారు. అంతేగాక అలీపోర్ పోలీస్ అండ్ సెషన్స్ కోర్టులో క్రిమినల్ లాయర్‌గా చేస్తున్నట్టు కాలేజీ వర్గాలు తెలిపాయి. టీఎంసీకి చెందిన పలువురు నేతలతో మోనోజిత్‌కు దగ్గర సంబంధాలున్నట్లు సమాచారం. ఘటనపై వామపక్ష విద్యార్థి విభాగం, కాంగ్రెస్ శ్రేణులు కస్బా పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగాయి.తృణమూల్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు అత్యాచారోదంతంపై తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘యువతులు తాము ఎలాంటి వారితో కలిసి తిరుగుతున్నామో చూసుకోవాలి. రాష్ట్రంలో ప్రతి చోటా మహిళలకు పోలీసులు రక్షణ కల్పించడం సాధ్యం కాదు’’ అన్నారు. ఈ ఉదంతంపై నిరసనలు పెరిగి పెద్దవవుతుండటంతో తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ప్రధాన నిందితుడు మోనోజిత్‌తో పారీ్టకి సంబంధం లేదని ప్రకటించింది. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొంది. కానీ తృణమూల్ ప్రకటనను బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఖండించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు పలువురు ప్రముఖ తృణమూల్ నేతలతో పాటు మోనోజిత్ ఎన్నోసార్లు వేదికలపై కని్పంచినట్టు చెప్పారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మమతకు సీఎంగా కొనసాగే అర్హత లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ సువేందు అధికారి మండిపడ్డారు. -
ఓయూ లా కాలేజీలో పరీక్షల విభాగం బాగోతం
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కాలేజీలో ఓ విద్యార్థి ఎల్ఎల్ఎం రెండో సెమిస్టర్ పరీక్షలు రాశాడు. గతంలో ఫెయిలైన నాలుగో పేపర్ ఈసారి బాగా రాశాడు. కానీ ఫెయిలయ్యాడు. అనుమానం వచ్చి తన జవాబు పత్రాల ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కాపీ వచ్చాక చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే అసలు ఆ జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేయనేలేదు. ఫలితాల్లో మాత్రం 23 మార్కులు వచ్చి, ఫెయిలైనట్లు చూపారు. ఎల్ఎల్ఎం మూడో సెమిస్టర్ పూర్తిచేసిన మరో విద్యార్థి ఐదో పేపర్లో ఫెయిలయ్యాడు. సందేహంతో జవాబు పత్రం ఫొటోకాపీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తాను రాసింది ఎల్ఎల్ఎం కోర్సు మూడో సెమిస్టర్ పరీక్షలుకాగా.. అధికారులు పంపింది ఎల్ఎల్బీ కోర్సు మూడో సెమిస్టర్ పరీక్షలు రాసిన మరో విద్యార్థి జవాబు పత్రం. ఏకంగా కోర్సు, జవాబుపత్రం మారినా.. ఆ మార్కులు చూపించి ఫెయిల్ చేశారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో న్యాయ విద్య పరీక్షల మూల్యాంకనంలో తప్పిదాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. ఈ రెండు ఉదాహరణలే కాదు.. అధికారుల తప్పిదాల కారణంగా చాలా మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎల్ఎల్బీ ఐదో సంవత్సరం ఫలితాల్లో తాను ఫెయిలైనట్లు చూపడంతో.. మరో విద్యార్థి రీ వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో 15 మార్కులు తక్కువగా వేసినట్లు బయటపడింది. ఆ విద్యార్థికి తొలుత వేసింది 37 మార్కులేకాగా.. రీ వ్యాల్యుయేషన్‌లో లెక్కతేలిన మార్కులు 52 కావడం గమనార్హం. నిర్లక్ష్యానికి పరాకాష్టగా.. ఉస్మానియా వర్సిటీ పరీక్షల విభాగం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా తయారైందని విమర్శలు వస్తున్నాయి. అధికారులు, ప్రొఫెస ర్ల తప్పిదాలతో అనేక మంది విద్యార్థులు నష్టపోతున్నారు. పరీక్షలు బాగా రాసినా జవాబు పత్రాలను సరిగా మూల్యాంకనం చేయక.. కొ న్నిసార్లయితే మూల్యాంకనమే చేయకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన చోట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాదే కాదు.. చాలా సంవత్సరాలుగా ఇదే తరహా పరిస్థితి ఉంటోందని విద్యార్థులు వాపోతున్నారు. తప్పుల మీద తప్పులు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కాలేజీల్లో మే నెలలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పరీక్షలు జరిగాయి. వీటికి దాదాపు 7 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు ఆగస్టులో విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల్లో కొందరు జవాబు పత్రాల ఫొటో కాపీల కోసం దరఖాస్తు చేయడంతో అధికారులు, ప్రొఫెసర్ల బాగోతం బయటపడింది. మే 22న ఎల్ఎల్ఎం రెండో సెమిస్టర్ నాలుగో పేపర్ పరీక్షకు సంబంధించి ఓ విద్యార్థి జవాబు పత్రాన్ని మూల్యాంకనమే చేయలేదు. మార్కుల షీట్లో మార్కులు కూడా వేయలేదు. కానీ ఫలితాల్లో మాత్రం ఆ సబ్జెక్టులో కొన్ని మార్కులను చూపించి ఫెయిల్ చేశారు. మే 19వ తేదీన జరిగిన ఎల్ఎల్ఎం మూడో సెమిస్టర్ ఐదో పరీక్షకు హాజరైన ఓ విద్యార్థి జవాబు పత్రం గల్లంతైంది. అదే తేదీన జరిగిన ఎల్ఎల్బీ మూడో సెమిస్టర్ పరీక్షలకు హాజరైన వేరే విద్యార్థి మార్కుల షీట్లో పేర్కొన్న మార్కులను ఎల్ఎల్ఎం విద్యార్థికి వేసి ఫెయిల్ చేశారు. అంతేకాదు జవాబు పత్రం ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసుకున్న ఈ ఎల్ఎల్ఎం విద్యార్థికి ఇచ్చింది కూడా ఎల్ఎల్బీ మూడో సెమిస్టర్ పరీక్ష రాసిన వేరే విద్యార్థి జవాబు పత్రం. మరో విచిత్రం ఏమిటంటే.. కనీసం ఈ మారిన జవాబు పత్రాన్ని కూడా మూల్యాంకనం చేయలేదు. కనీసం మార్కుల షీట్లో మార్కులు వేయలేదు, ఎగ్జామినర్, స్క్రూటినైజర్ సంతకాలు కూడా లేవు. కానీ ఇష్టం వచ్చినట్లుగా ఏవో మార్కులు వేసి ఫెయిల్ చేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకునేదెవరు? తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొనేందుకు వెళ్లిన విద్యార్థులకు సమాధానమిచ్చే వారే లేకుండా పోయారు. పరీక్షల విభాగంలో అడిగితే అధికారులెవరూ పెద్దగా స్పందించడం లేదు. దాంతో విద్యార్థులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. అసలు ఎల్ఎల్బీ పరీక్షల్లో రీవెరిఫికేషన్‌కు అవకాశమిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు... ఎల్ఎల్ఎంలో రీ వెరిఫికేషన్‌కు అవకాశమివ్వడం లేదు. రీ వెరిఫికేషన్‌కు అవకాశముంటే... మార్కులు నష్టపోయిన విద్యార్థుల జవాబు పత్రాలను మరోసారి పరిశీలించేవారు. దాంతో ముందుగా మూల్యాంకనం చేయకపోతే.. రీవెరిఫికేషన్లో మూల్యాంకనం చేసి మార్కులు ఇచ్చే అవకాశం ఉండేది. కానీ ఎల్ఎల్ఎంలో ఆ అవకాశం లేకపోవడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. -
ముగిసిన హంగామా