This Parody Song About Tomato Price Hike, Video Viral - Sakshi
Sakshi News home page

ఆల్‌టైమ్‌ రికార్డులో టమాట రేటు.. ట్రెండింగ్‌లో పేరడీ సాంగ్‌

Jul 7 2023 6:30 PM | Updated on Jul 7 2023 6:36 PM

Khushaal Parody Song On Tomato Price Hike Video Viral - Sakshi

దేశ‌వ్యాప్తంగా ట‌మాట ధ‌ర‌లు చుక్కలు చూపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఆల్‌ టైమ్‌ ధరలను బ్రేక్‌ చేస్తూ ట‌మాట కిలో ఏకంగా రూ. 150 దాటి ప‌రుగులు పెడుతున్న‌ది. ఈ క్రమంలో సామాన్యులు టమాటాలను కొనే పరిస్థితి కనిపించడం లేదు.

మరోవైపు.. నిత్యావ‌స‌ర కూర‌గాయ ధ‌ర‌లు కూడా ఆకాశానికి అంటుతున్నాయి. ఇక ట‌మాట ధ‌ర‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్దఎత్తున మీమ్స్ ట్రెండ్‌ అవుతున్నాయి. ఇక లేటెస్ట్‌గా కంటెంట్ క్రియేట‌ర్ కుషాల్ ట‌మాట ధ‌ర‌ల పెంపుపై ఓ పేర‌డీ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. 

ఈ వీడియోలో టమాట ధరలపై కుశాల్‌తో పాటు ప‌లువురు వ్య‌క్తులు పేర‌డీ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ప్ర‌ముఖ త‌మిళ సాంగ్ తుమ్ తుమ్ సాంగ్‌కు పేర‌డీ లిరిక్స్ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకున్నాయి. రోజువారీ వంట‌కాల్లో మ‌నం వాడే ట‌మాట ధ‌ర మోతెక్క‌డం గురించి ఈ సాంగ్ లిరిక్స్ ప్ర‌స్తావిస్తాయి. దీంతో, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి క‌ష్టాల‌ను కుశాల్ త‌న పేర‌డీ సాంగ్‌లో అద్భుతంగా వ‌ర్ణించార‌ని ప‌లువురు నెటిజన్లు ప్ర‌శంసించారు. వినూత్న కాన్సెప్ట్‌తో కంటెంట్ క్రియేట‌ర్ ముందుకొచ్చార‌ని మెచ్చుకున్నారు. ఈ వీడియోకు నెట్టింట ఇప్ప‌టివ‌ర‌కూ ఏకంగా 4.53 ల‌క్ష‌ల లైక్‌లు రాగా పెద్ద‌సంఖ్య‌లో నెటిజ‌న్లు రియాక్ట‌య్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement