సాక్షి, ఢిల్లీ: పేదల సామాజిక భద్రతకు మరింత భరోసా కేంద్ర ప్రభుత్వం మరింత భద్రత కల్పించబోతున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దివ్యాంగుల పెన్షన్ అర్హతకు వైకల్యం 80% నుంచి 40% కు తగ్గించామని 18 ఏళ్ల కనీస వయోపరిమితి తొలగించామని.. పుట్టినప్పటి నుంచే అర్హులైన దివ్యాంగులకు పెన్షన్ అందేలా కేంద్ర క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల కేంద్ర పెన్షన్ సహాయం 25% పెంచినట్లు తెలిపారు.
ఈ రోజు జరిగిన క్యాబినెట్ భేటీలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర సామాజిక భద్రతా పింఛన్ల పథకానికి రూ.53,428 కోట్లు కేటాయించింది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (NSAP) కొనసాగింపునకు ఆమోదం తెలిపింది. 2026–27 నుంచి 2030–31 వరకు ఐదేళ్లపాటు పథకం అమలు చేయనున్నట్లు పేర్కొంది. పథకం కోసం రూ.53,428 కోట్ల నిధుల కేటాయింపు
నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ పేరు ప్రధానమంత్రి సామాజిక సహాయ యోజనగా మార్పు
వృద్ధాప్య పింఛను పథకం పేరు ప్రధానమంత్రి వృద్ధావస్థ పింఛను యోజనగా మార్పు
వితంతు పింఛను పథకం పేరు ప్రధానమంత్రి విధవా పింఛను యోజనగా మార్పు
దివ్యాంగుల పింఛను పథకం పేరు ప్రధానమంత్రి దివ్యాంగజన్ పింఛను యోజనగా మార్పు
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం పేరు ప్రధానమంత్రి పరివార్ లాభ్ యోజనగా మార్పు
దివ్యాంగుల పింఛనులో వయస్సు ఆధారంగా ఆర్థిక సాయం పెంపు
0–79 ఏళ్ల దివ్యాంగులకు నెలకు రూ.375 పింఛను
80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న దివ్యాంగులకు నెలకు రూ.625 పింఛను


