హార్ముజ్‌ రూట్లో మనవాళ్లొద్దు!.. షిప్పింగ్‌ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు | Indias Big Move To Protect Indian Sailors Amid US-Iran Conflict In Hormuz | Sakshi
Sakshi News home page

హార్ముజ్‌ రూట్లో మనవాళ్లొద్దు!.. షిప్పింగ్‌ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు

Jul 17 2026 5:06 AM | Updated on Jul 17 2026 5:06 AM

Indias Big Move To Protect Indian Sailors Amid US-Iran Conflict In Hormuz

న్యూఢిల్లీ: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో కేంద్రం ఓడల యజమాన్యాలు, నిర్వాహకులు, రిక్రూట్‌మెంట్‌ సంస్థలకు కొత్త అడ్వైజరీ విడుదల చేసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణించే నౌకల్లో భారతీయ నావికులను నియమించొద్దని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ మారిటైమ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీజీఎమ్‌ఏ) ఆదేశించింది. 

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ రూట్లో భారతీయులను నియమించొద్దని స్పష్టం చేసింది. ఇటీవల వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో ఇద్దరు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం ఈ భద్రతా చర్యలు తీసుకుంది. 

మధ్యప్రాచ్యంలో మారుతున్న భద్రతా పరిస్థితిని తాము నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, భారతీయ నావికుల భద్రత, రక్షణ, సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని డీజీఎంఏ తెలిపింది. భారతీయ నావికుల భద్రత కోసం మరికొన్ని ముందుజాగ్రత్త చర్యలను కూడా డీజీఎంఏ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement