స్పేష్‌ మిషన్‌లో భాగస్వామ్యంనా అదృష్టం: శుభాన్షు  | Indian astronaut Shubhanshu Shukla Axiom-4 mission set for lift-off from Florida | Sakshi
Sakshi News home page

స్పేష్‌ మిషన్‌లో భాగస్వామ్యంనా అదృష్టం: శుభాన్షు 

Jun 9 2025 5:07 AM | Updated on Jun 9 2025 5:07 AM

Indian astronaut Shubhanshu Shukla Axiom-4 mission set for lift-off from Florida

రేపు ఐఎస్‌ఎస్‌కు పయనం 

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆక్జియం–4 స్పేష్‌ మిషన్‌లో భాగస్వామి కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (39) చెప్పారు. మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోబోతున్నారు. అమెరికాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి మంగళవారం సాయంత్రం 5.52 గంటలకు ఫాల్కన్‌–9 రాకెట్‌ ద్వారా వారి ప్రయాణం ప్రారంభం కానుంది.

 ఇదొక అద్భుతమైన ప్రయాణం అవుతుందని భావిస్తున్నట్లు శుభాన్షు చెప్పారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూప్‌ కెపె్టన్‌ అయిన శుక్లా రాకేశ్‌ శర్మ అనంతరం 41 ఏళ్లకు అంతరిక్షంలోకి చేరుకోబోతున్న రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించబోతున్నారు. ఆగ్జియం మిషన్‌ నిమిత్తం అమెరికాలో కొద్ది నెలలుగా ప్రత్యేక శిక్షణ పొందారు. 

రాకేశ్‌ శర్మ సోవియట్‌ యూనియన్‌కు చెందిన సోయజ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి వెళ్లి 8 రోజులుండి తిరిగొచ్చారు. ఆయనను శుభాన్షు తన స్ఫూర్తిప్రదాతగా భావిస్తుంటారు. శుక్లాతోపాటు కమాండర్‌ పెగ్గీ విట్సన్, మిషనల్‌ స్పెషలిస్టులు టిబోర్‌ కపూ, స్లావోజ్‌ ఉజ్‌నాన్‌స్కీ–విస్నీవెస్కీ స్పేస్‌ఎక్స్‌ మిషన్‌లో భాగంగా డ్రాగన్‌ క్యాప్సూల్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోబోతున్నారు. డ్రాగన్‌ క్యాప్సూల్‌కు శుక్లా పైలట్‌గా వ్యవహరిస్తారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement