ఢిల్లీ: సర్‌కు వ్యతిరేకంగా సేవ్ డెమోక్రసీ పేరుతో ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. పార్లమెంట్ నుంచి ఈసీకి ఎంపీలు ర్యాలీగా బయలు దేరారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. ఇండి బ్లాక్ ఎంపీల ర్యాలీతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పార్లమెంట్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు పోలీసులు మోహరించారు.
దీంతో ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. సెంట్రల్ ఢిల్లీలో పలు రోడ్లు మూసివేశారు. ఓట్ బచావో.. దేశ్ బచావో అంటూ ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. ఈసీ కార్యాలయానికి వెళ్తున్న విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆకాశవాణి భవన్ దగ్గర రోడ్డుపై విపక్ష ఎంపీలు బైఠాయించారు. రోడ్డపై ఖర్గే, రాహుల్, ప్రియాంక, సహా ఇతర ఎంపీలు నిరసనలు తెలుపుతూ.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తప్పించాలని డిమాండ్ చేశారు.
‘సర్’లో భాగంగా తొలగించిన 13.30 కోట్ల ఓట్లు పునరుద్ధరించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇండియా కూటమి నిరసనలకు ఏఏపీ, డీఎంకే దూరంగా ఉన్నాయి సంసద్ మార్గ్, ఈసీ కార్యాలయం, జంతర్‌మంతర్ పరిసరాల్లో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. నిరసనలకు అడ్డుకునేందుకు జంతర్‌మంతర్ వద్ద నిషేధాజ్ఞలు విధించారు.
ఇదీ చదవండి: నిరసనలో మేం పాల్గొనం: ఆప్



