ఎగ్జామ్‌హాల్‌ ఫుటేజీ కీలకం..! | IIT Bombay student suicide reopens the question of caste on the Indian campus | Sakshi
Sakshi News home page

ఎగ్జామ్‌హాల్‌ ఫుటేజీ కీలకం..!

Sep 23 2026 5:40 AM | Updated on Sep 23 2026 5:40 AM

IIT Bombay student suicide reopens the question of caste on the Indian campus

సీసీటీవీ వీడియోలను స్వాదీనం చేసుకున్న పోలీసులు 

ప్రొఫెసర్‌ సూర్యనారాయణ,  డైరెక్టర్‌ శిరీష్ లను అరెస్ట్‌ చేయండి 

సాహిల్‌ తండ్రి డిమాండ్‌

ముంబై:  ఐఐటీ బాంబే కాలేజీలో బీటెక్‌ విద్యార్థి సాహిల్‌ వకోడె ఆత్మహత్యకు పరీక్షగదిలో చాట్‌జీపీటీ ఉపయోగించడమూ పరోక్షంగా కారణమనే వాదనల నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగిందని తెల్సుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పరీక్షాహాల్‌లో రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనంచేసుకుని పరిశీలిస్తున్నారు. మొబైల్‌ను సాహిల్‌ ఎగ్జామ్‌హాల్‌లో ఉపయోగించినట్లు నమోదైందా? పరీక్షగదిలోనే విద్యారి్థని ఇన్విజిలేటర్‌ సూర్యనారాయణ ప్రశ్నించారా? అనే వివరాలపై స్పష్టతరానుంది.

అయితే సాహిల్‌ను పరీక్ష గదిలో ప్రొఫెసర్‌ సూర్యనారాయణ పట్టుకున్నారని, ఎగ్జామ్‌ రాయకుండా అడ్డుకుని బయటకు తీసుకెళ్లి ప్రశ్నించినట్లు సీసీటీవీలో రికార్డయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆరోజు మధ్యాహ్నం 12.30 నుంచి 12.45 గంటల మధ్య రికార్డయిన ఫుటేజీలో ఈ విషయం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్‌ మందలింపు తర్వాత సాహిల్‌ 1.15 గంటలకు నేరుగా పవయీ హాస్టల్‌కు నడుచుకుంటూ వెళ్లి సాయంత్రం సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. ప్రొఫెసర్‌ కులం పేరుతో దూషిస్తే సాహిల్‌ కాలేజీలోని ఎస్సీ/ఎస్టీ విభాగానికి ఫిర్యాదుచేయలేదని ఐఐటీ బాంబే అధ్యాపక సంఘం అధ్యక్షుడు వెల్లడించారు. 

ఏడాదికాలంగా వేధిస్తున్నాడు.. 
ఘటనపై సాహిల్‌ తండ్రి రవీంద్ర, తల్లి సొనాలీ మంగళవారం మాట్లాడారు. ‘‘ఏడాదికాలంగా మా అబ్బాయిని ప్రొఫెసర్‌ సూర్యనారాయణ వేధిస్తున్నాడు. ఆయనది ఎక్కువ కులమని, మనది తక్కువ కులమని సూర్యనారాయణ అన్నట్లు సాహిల్‌ గతంలో నాకు చెప్పి బాధపడ్డాడు. ప్రొఫెసర్, కాలేజీ డైరెక్టర్‌ శిరీష్ లను అరెస్ట్‌చేయాలి’’అని రవీంద్ర డిమాండ్‌చేశారు. ‘‘వేధింపులే అబద్ధమనుకుంటే దళిత విద్యార్థులే ఎందుకు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు?’’అని తల్లి సొనాలీ ప్రశ్నించారు.  

సీలింగ్‌ బదులు వాల్‌–మౌంటెడ్‌ ఫ్యాన్లు.. 
సీలింగ్‌ ఫ్యాన్‌కు సాహిల్‌ ఉరేసుకోవడంతో వాటిని ఉపయోగించకూడదని యాజ మాన్యం నిర్ణయించింది. విద్యార్థుల హాస్టళ్ల నుంచి వాటిని తొలగించే ప్రక్రియ ఆరంభించారు. వాటి స్థానంలో గోడకు బిగించే వాల్‌–మౌంటెడ్‌ ఫ్యాన్లను కొత్తవి తెప్పించారు. హాస్టల్‌తోపాటు కాలేజీ అనుబంధ భవనాల్లో వీటినే బిగించనున్నారు. ఫ్యాన్లు మార్చినంత మాత్రాన సమస్య సమసిపోదని ఎన్సీపీ(ఎస్పీ) నేత అనీశ్‌ గవాండే అసహనం వ్యక్తంచేశారు. విద్యార్థుల ఒత్తిళ్లకు కొత్త ఫ్యాన్లు సమాధానమా? అని ఆయన ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement