హిందూ యువకుని ‘ముస్లిం వ్యవహారం’.. తండ్రి ఫిర్యాదుతో..

hindu youth suddenly started offering namaz - Sakshi

దేశంలో హిందూ- ముస్లిం వివాదాలకు సంబంధించిన ఉదంతాలు తరచూ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ఇదే కోవలో తాజాగా డెహ్రాడూన్‌లో  చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. 
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ పరిధిలోని డోయీవాలా ప్రాంతంలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక యువకుని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కుమారుడు ఇంటిలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నారు. తన 24 ఏళ్ల కుమారుడు ఇంటిలో ఉన్నట్టుండి నమాజ్‌ చేస్తున్నాడని, అలాగే అతని లాప్‌టాప్‌​, మొబైల్‌ ఫోన్‌లలో ఆశ్చర్యకరమైన డేటా ఉందని తెలిపారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం వైభవ్‌ బిజ్లవాణ్‌(24) గత మూడేళ్లుగా డిప్రెషన్‌లో ఉన్నాడు. అతనికి ఇస్లాంపై విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది. పోలీసుల విచారణలో అతని ల్యాప్ టాప్‌, మొబైల్‌ ఫోను నుంచి సేకరించిన సమాచారం ప్రకారం  వైభవ్‌ ముస్లిం మతానికి సంబంధించిన ఆచారవ్యవహారాలను నేర్చుకుంటున్నాడు. ప్రతీరోజూ వీటిని అనుసరిస్తున్నాడు. పోలీసుల దర్యాప్తులో.. వైభవ్‌ తన గది నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదని, గత మూడేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని వెల్లడయ్యింది.

పోలీసులు ‍వైభవ్‌కు సైకలాజికల్‌ టెస్ట్‌ చేయిస్తున్నారు. డెహహ్రాడూన్‌ పోలీసు అధికారి దిలీప్‌  కుమార్‌ మాట్లాడుతూ ఆ యువకుడు నిత్యం గదిలోనే ఉంటున్నాడని, దీనిపై అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. తమ బృందం పరిశీలనలో ఆ యువకుడు డిప్రెషన్‌లో బాధపడుతున్నాడని తెలిసిందన్నారు. ఆన్‌లైన్‌లో ఇస్లాం ఆచారాల గురించి తెలుసుకుంటున్నాడని, ఉర్దూ నేర్చుకుంటున్నాడని తెలిపారు. ఆ యువకునికి సంబంధించిన మెడికల్‌ రిపోర్టు రాగానే తదుపరి చర్యలు చేపడతామన్నారు.

చదవండి: జులై 1 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top