Tamil Nadu Weather Updates: వర్ష బీభత్సం.. గంటల వ్యవధిలోనే రికార్డ్ వర్షపాతం | IMD Issues Red Alert Over South Tamil Nadu - Sakshi
Sakshi News home page

Tamil Nadu Weather Updates: వర్ష బీభత్సం.. గంటల వ్యవధిలోనే రికార్డ్ వర్షపాతం

Dec 18 2023 3:56 PM | Updated on Dec 18 2023 5:07 PM

Heavy Rains In South Tamilnadu  - Sakshi

చెన్నై: తమిళనాడుని వర్షాలు ముంచెత్తుతున్నాయి. మొన్నటి దాకా  చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు ప్రస్తుతం దక్షిణ తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. 12-14 గంటల వ్యవధిలో ఎడతెగని వర్షం కురిసింది. మణిముత్తర్, తిరుచెందూర్‌లలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం సంభవించింది. 500 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. తమిళనాడులో ఇటీవల కాలంలో ఇంతటి స్థాయిలో వర్షపాతం రావడం ఇదే ప్రథమం. 

దక్షిణ తమిళనాడులోని తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, టెన్‌కాశి జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఈ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలతో పాటు బ్యాంకులు,ప్రైవేటు సంస్థల ఆఫీసులకు ఇప్పటికే సెలవు ప్రకటించింది. 

దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి అక్కడి పరిస్థితి గందరగోళంగా తయారైంది. పలు చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచి రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దక్షిణ తమిళనాడులోని జిల్లాలతో పాటు దక్షిణ కేరళ, లక్షద్వీప్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

‘కన్యాకుమరి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెన్‌కాశీ  జిల్లాల్లో భారీ వర్షాల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాం. స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(ఎస్డీఆర్‌ఎఫ్‌)కు చెందిన 250 మంది సిబ్బందిని సహాయక చర్యల కోసం నియమించాం’ అని తమిళనాడు రెవెన్యూ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ మంత్రి రామచంద్రన్‌ తెలిపారు. 

ఇదీ చదవండి: కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం?

Advertisement
 
Advertisement
Advertisement