సూట్‌కేస్‌లో గర్ల్‌ఫ్రెండ్‌ | Haryana student tries to sneak girl into boys hostel by hiding her in suitcase | Sakshi
Sakshi News home page

సూట్‌కేస్‌లో గర్ల్‌ఫ్రెండ్‌

Apr 13 2025 6:36 AM | Updated on Apr 13 2025 6:36 AM

Haryana student tries to sneak girl into boys hostel by hiding her in suitcase

హాస్టల్‌లోకి తీసుకెళ్తూ దొరికిపోయిన విద్యార్థి

సోనిపట్‌: గర్ల్‌ ఫ్రెండ్‌ను సూట్‌కేస్‌లో దాచి తనుండే బాయ్స్‌ హాస్టల్‌లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఓ విద్యార్థి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన హరియాణా రాష్ట్రం సోనిపట్‌లోని ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీలో ఇటీవల చోటుచేసుకుంది. భారీ సూట్‌కేస్‌తో హాస్టల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ విద్యార్థిని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. 

సూట్‌కేస్‌ తెరిచేందుకు తీసేందుకు యత్నించారు. విద్యార్థులు చుట్టూ గుమికూడారు. సూట్‌కేస్‌ తెరిచి చూడగా ఓ యువతి బయటకు రావడంతో అంతా షాకయ్యారు. ఓ విద్యార్థి ఇదంతా వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వైరలయ్యింది. వర్సిటీ పీఆర్‌వో మాత్రం, ‘మా విద్యార్థులు అల్లరి చేశారంతే, ఇదేమంత పెద్ద విషయం కాదు’ అంటూ తేలిగ్గా కొట్టిపారేయడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement