breaking news
hostel building
-
కుప్పకూలిన ఐదంతస్థుల భవనం..
-
భవన యజమాని అరెస్ట్
న్యూఢిల్లీ: విద్యాభ్యాసం, ఉపాధి కోసం వచ్చి పాత హాస్టల్ భవనంలో తలదాచుకున్న విద్యార్థులు, యువత భవిష్యత్తును అంధకారం చేస్తూ పేకమేడలా ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో భవన యజమాని కుటుంబాన్ని పోలీసులు అరెస్ట్‌చేశారు. కూలిన భవన యజమాని అయిన మాజీ భారత వాయుసేన సార్జెంట్, 81 ఏళ్ల హరిరామ్ గుప్తా, ఆయన భార్య ఊర్మీళ(75), కుమారుడు మహేశ్(52)లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేశారు. పారిపోతున్న హరిరామ్‌ను హరియాణా–రాజస్తాన్ సరిహద్దుల్లోని భీవాడీలో పోలీసులు పట్టుకున్నారు. భవనం పాడవుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించినందుకు, పలువురి మరణాలకు కారణమైనందుకు వీళ్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. పేయింగ్ గెస్ట్ భవనాన్ని హరిరాం, అతని కుమారుడు నిర్వహిస్తున్నారు. భవనం భార్య పేరిట ఉంది. మరోవైపు భవనం కూలిన ఘటనలో మరణాల సంఖ్య ఏడుకు పెరిగింది. 27 గంటలపాటు నిరాటంకంగా కొనసాగిన అన్వేషణ, సహాయక చర్యలు సోమవారం సాయంత్రం ముగిశాయి. ఘటన జరిగినప్పటి నుంచి మొత్తంగా 12 మందిని శిథిలాల నుంచి అతికష్టంమీద బయటకు తీశారు. వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణం సమీప సత్య నికేతన్ ప్రాంతంలో బాయ్స్ పేయింగ్ గెస్ట్ భవనం కూలిన ఘటనపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) సారథ్యంలో ఉన్నతస్థాయి విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశాలిచ్చింది. ‘‘ఎంసీడీ, ఇతర సంస్థలు చేపట్టిన చర్యల్లో పూర్తి నిర్లక్ష్యవైఖరి కారణంగానే భవనాలు కూలుతున్నాయి. ఇలాంటి దారుణోదంతాలతో తమకు సంబంధం లేదు అని ప్రభుత్వాలు చేతులు దులిపేసుకోవద్దు’’అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కూలిన భవనానికి ఎలాంటి పిల్లర్లు, బీమ్‌లు లేకపోవడం గమనార్హం. మరోవైపు క్షతగాత్రులను ఢిల్లీ ఎయిమ్స్ ట్రామా సెంటర్లో చేర్పించడంతో తమ వారి ఆరోగ్య పరిస్థితి తెల్సుకునేందుకు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆప్తులు ఆస్పత్రికి తరలివచ్చారు. వీడియోకాల్ చేసి... ప్రాణాలతో బయటపడి.. బిహార్‌కు చెందిన 19 ఏళ్ల ఆదిత్య బీకామ్ తొలి ఏడాది చదువుతూ నాలుగు రోజుల క్రితమే ఈ భవనంలో పై అంతస్తులో దిగాడు. భవనం కూలినప్పుడు శిథిలాల్లో చిక్కుకున్నా ఎలాగోలా సోదరి ఫోన్‌చేసి ‘‘నన్ను కాపాడండి. శిథిలాల్లో ఉన్నా. ఫోన్ బ్యాటరీ అయిపోతోంది. కాపాడండి’’అని చెప్పగానే ఫోన్ కట్‌అయింది. విషయం వెంటనే అక్కడి సహాయక బృందాలకు చెప్పగానే ఎలాగోలా శిథిలాల నుంచి అతడిని కాపాడారు. ప్రస్తుతం ఇతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏకంగా నాలుగు గంటల తర్వాత ఆదిత్యను కాపాడటంపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీకామ్ చదువుతూ ఇదే భవనంలో ఉంటున్న 18 ఏళ్ల తన కుమారుడు అక్షిత్ లేడనే వార్త తెలిసి తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ‘‘కాలిపై ఉన్న ఒకే ఒక్క పుట్టుమచ్చతో మా వాడిని గుర్తించా. ఘటన జరగడానికి కొన్ని గంటల ముందే ఊరి నుంచి తిరిగొచ్చి దుర్ఘటనలో బలయ్యాడు’’అని ఆమె ఏడుస్తూ చెప్పారు. అధికారుల సస్పెన్షన్ ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా సోమ వారం ఘటనాస్థలికి సందర్శించారు. అధ్వానంగా ఉన్న భవనం వివరాలను ప్రభుత్వం దృష్టికితేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత ప్రభుత్వాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో కొద్దిసేపటికే ఎంసీడీ డిప్యూటీ కమిషనర్ రాకేశ్ సహా సౌత్ జోన్ సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(భవనాలు), అసిస్టెంట్ ఇంజనీర్(భవనాలు), జూనియర్ ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్‌చేసింది. నగరంలో అక్రమంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాలను సీజ్ చేయాలని సీఎం ఆదేశించారు. బీజేపీ ప్రభుత్వాలపై రాహుల్ విమర్శలు ఢిల్లీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ‘‘భవనం కుప్పకూలడం సహా ప్రభుత్వాల వైఫల్యాలపై ఎవరు ఏ ప్రశ్నలడిగినా వాళ్లను కించపరచడమే మోదీ పనిగా పెట్టుకున్నారు. ప్రతిసారీ ప్రజల జీవితాలు, ఆశలు, ఆశయాలు ఇలాంటి భవనాల కింద నలిగిపోతున్నాయి. ప్రశ్నిస్తే ‘దిమాగీ నక్సల్’, ‘నారాజ్ ఫూఫా’ అంటూ కొత్త విమర్శలు సంధిస్తారేగానీ వైఫల్యాలకు తమదే బాధ్యత అనే జవాబుదారీతనం మాత్రం మోదీ ప్రదర్శించరు’’అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ఢిల్లీ హాస్టల్ ఘటన: పెరిగిన మృతుల సంఖ్య
ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వచ్చిన విద్యార్థుల జీవితాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఆదివారం కుప్పకూలిన పీజీ హాస్టల్ భవనం ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. రాత్రంతా కొనసాగిన సహాయక చర్యల్లో మరో వ్యక్తిని శిథిలాల నుంచి బయటకు తీసినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 11 మందిని రక్షించగా.. మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది.బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతుండగానే.. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో లోపల ఉన్న పలువురు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. భవనం కూలడానికి బేస్మెంట్ పనులు, నిర్మాణంలో లోపాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదానికి సంబంధించిన మరో సీసీటీవీ దృశ్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. కూలిపోయిన భవనానికి ఎదురుగా ఉన్న దుకాణం వద్ద ఓ వ్యక్తి కూర్చుని ఉండగా.. ఒక్కసారిగా భవనం కూలడం ప్రారంభమైంది. భారీగా దుమ్ము కమ్ముకోవడంతో అప్రమత్తమైన అతడు వెంటనే దుకాణం నుంచి బయటకు పరుగెత్తాడు. క్షణాల వ్యవధిలోనే భవనం కుప్పకూలడంతో అతడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.DELHI: SATYA NIKETAN BUILDING COLLAPSE: CCTV FOOTAGE EMERGESCCTV footage from opposite the building captures the moment a person rushes out of his shop to save his life as the collapse unfolds.Search and rescue operations continue at the site. pic.twitter.com/svxVTwDYhW— Subodh Kumar (@kumarsubodh_) September 7, 2026తప్పిన పెనుముప్పు?సత్య నికేతన్‌లోని ఈ ఐదు అంతస్తుల భవనంలో సుమారు 15 గదులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్కో గదిలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు ఉండేవారని చెప్పారు. ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకోవడంతో చాలామంది విద్యార్థులు బయట ఉండటం వల్ల ప్రాణనష్టం కొంత తగ్గిందని స్థానికులు పేర్కొన్నారు. ఇక సుమారు 30 ఏళ్ల నాటి ఈ భవనంలో ‘హాస్టల్ డేజ్’ పేరుతో పీజీ వసతి గృహం నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి ముందు బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవలి వర్షాలతో బేస్మెంట్లో నీరు చేరి పునాది బలహీనపడటం వల్లే భవనం కూలిపోయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.శిథిలాల కింద ఆర్తనాదాలు..భవనం కూలిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారు తమను కాపాడాలంటూ ఫోన్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కొందరు బాధితులు లోపల నుంచి వీడియోలు తీసి మిత్రులకు పంపించారు. శిథిలాల కింద ఉన్నవారు ఊపిరి పీల్చుకునేందుకు ఆక్సిజన్ సిలిండర్లను పంపించినట్లు సహాయక సిబ్బంది వెల్లడించారు.ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగిస్తున్నారు. ఇరుకైన వీధులు కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శిథిలాల కింద పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.పీజీల నిర్వహణపై ప్రశ్నలుసత్య నికేతన్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పీజీలు, హాస్టళ్లలో ఉంటున్నారు. పాత భవనాలను పీజీలుగా మార్చి నిర్వహిస్తున్న తీరుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనాల నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలు, నిర్వహణపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ప్రముఖుల సంతాపంఈ విషాద ఘటనపై రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్‌జీత్ సింగ్ సంధు కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.మరోవైపు.. మృతుల సంఖ్య ఆరుకు చేరడం, మరికొందరి కోసం గాలింపు కొనసాగుతుండటంతో సత్య నికేతన్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా బయటపడిన సీసీటీవీ దృశ్యాలు మాత్రం ప్రమాదం కూలిన భవనం లోపలే కాదు.. చుట్టుపక్కల ఉన్నవారినీ ఎంతటి ముప్పులోకి నెట్టిందో స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: రీల్స్ చూసి మోసపోవద్దు! పాపం ఆ అమ్మాయి.. -
విద్యార్థుల ఆశలు సమాధి
న్యూఢిల్లీ: ఉన్నత చదువుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఢిల్లీలో హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్‌లోని ఓ హాస్టల్ భవనం ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద దాదాపు 20 మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అన్వేషణ, సహాయక బృందాలు అంచనావేశాయి. రద్దీగా ఉండే ఒక వీధిలోని 30 ఏళ్ల నాటి ఈ ఐదు అంతస్తుల భవనంలో ‘హాస్టల్ డేజ్’ పేరిట పేయింగ్ గెస్ట్(పీజీ) వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. భవన బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతుండగా ఆదివారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో కూలింది. తాజా వర్షాలతో బేస్మెంట్లో నీరు చేరి పునాది బలహీనపడిందని, అందుకే కుప్పకూలిందని స్థానికులు చెప్పారు. ప్రమాదం విషయం తెల్సి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. భవనం కుప్పకూలి విద్యార్థులు మరణించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్‌జీత్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు పోలీసులు వివరించారు. లోపల చిక్కుకున్న వారి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఘటనా స్థలంలో బీజేపీ ఎమ్మెల్యే అనిల్ చెప్పారు. ఆదివారం కావడం వల్లే తక్కువ ప్రాణనష్టం కూలిపోయిన భవనంలో దాదాపు 15 గదులు ఉండేవని, ఒక్కో గదిలో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు కలిసి ఉండేవారని స్థానికులు తెలిపారు. ఆదివారం సెలవు కావడంతో చాలామంది విద్యార్థులు బయటకు వెళ్లినందున మరణాల సంఖ్య తగ్గిందని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఈ ప్రాంతంలోని ఇతర భవనాల పరిస్థితి, నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘సత్య నికేతన ప్రాంతంలో భవనాలను ఐదు, ఆరు అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. చాలా ఇళ్లను బాలుర పీజీలుగా మార్చేసి, యజమానులు వేరే చోటికి తరలిపోతున్నారు. వారు తమ ఇళ్లకు పీజీలని పేరు పెట్టి, ఆన్లైన్లో అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. భవనాల నిర్వహణ ఎలా ఉందో కూడా పట్టించుకోవడం లేదు’’ అని రెండు దశాబ్దాలకు పైగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రియాంక పేర్కొన్నారు. ప్రధాని మోదీ సంతాపం ఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. బాధితులకు సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు ఉంటున్న భవనం కూలిపోవడం చాలా బాధాకరమని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆప్తులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వివరించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రాణం విలువైనదని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ప్రాణాలకు భరోసా కల్పించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ఈ ఘటనను అత్యంత హృదయ విదారకమైనది, ఆందోళనకరమైనదిగా అభి వరి్ణంచారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సరైన వసతి గృహాలు లేకపోవడం వల్ల విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది ‘నివారించదగిన విషాదం’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.శిథిలాల కింద అరుపులు, ఆర్తనాదాలు ఘటనా స్థలంలో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలాల నుంచి పెద్ద ఎత్తున అరుపులు, ఆర్తనాదాలు వినిపించాయి. తమను కాపాడాలంటూ బాధితులు రోదిస్తూ వేడుకున్నారు. కొందరు ఫోన్లు సైతం చేశారు. లోపల చిక్కుకుపోయిన వారు అక్కడి దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించి మిత్రులకు పంపించారు. బాధితుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శిథిలాల కింద బాధితులు ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్లను జారవిడిచినట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక వాహనాలను మోహరించారు. ఈ ప్రాంతంలోని ఇరుకైన వీధుల్లో విద్యార్థుల కోసం హోటళ్లు, పీజీ వసతి గృహాలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో నివసిస్తున్న విద్యార్థుల్లో చాలామంది కేరళ, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని, వారు రోడ్డుకు అవతల ఉన్న కాలేజీల్లో చదువుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తుండగా స్థానికులు సహకరించారు. వారు తమ చేతులతో, అందుబాటులో ఉన్న సామగ్రితో బాధితుల కోసం గాలించారు. శిథిలాల కింద పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. కలచి వేసిన వీడియోహాస్టల్ భవనం కూలిపోగా కాంక్రీటు దిమ్మెల కింద ఓ విద్యార్థి చిక్కుకుపోయి నరకయాతన అనుభవించిన దృశ్యం చూపరులను కలచివేసింది. అతడిపై దుమ్ము పేరుకుపోయింది. ముఖంపై రక్తపు చారలు కనిపించాయి. నుదుటి పక్క నుండి రక్తం కారుతోంది. ఈ వీడియోను ఆత్మరామ్ కాలేజీ విద్యార్థులు షేర్ చేశారు. శిథిలాల కింద నుంచి ‘సేవ్ మీ, సేవ్ మీ’ అనే అరుపులు చాలాసేపు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. -
అహ్మదాబాద్ మెడికల్ కళాశాల హాస్టల్‌ను పునర్నిర్మించనున్న ప్రభుత్వం
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో గతేడాది జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్న హాస్టల్ సముదాయాన్ని గుజరాత్ ప్రభుత్వం పునర్నిర్మించనుంది. సుమారు రూ. 105 కోట్ల అంచనా వ్యయంతో ఆ ప్రదేశంలో ప్రభుత్వం కొత్త అత్యాధునిక హాస్టల్ సౌకర్యాన్ని నిర్మిస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా తెలిపారు. ప్రమాదం తర్వాత నిర్వహించిన స్ట్రక్చరల్ ఆడిట్లో భవనాలు అంత సురక్షితంగా లేవని తేలిందని, దీంతో కూల్చివేత అనివార్యమైందని ఆయన వెల్లడించారు. హాస్టల్ బ్లాక్‌లు, క్యాంటీన్, సబ్–స్టేషన్ భవనానికి జరిగిన నష్టానికి గాను ఆరోగ్య విభాగానికి రూ. 53.12 కోట్లు చెల్లించడానికి టాటా గ్రూప్ అంగీకరించిందన్నారు. హాస్టల్ పునర్నిర్మాణ ప్రణాళికను ఆయన ప్రకటించారు. విద్యార్థుల వసతి సౌకర్యాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు, రాష్ట్ర ప్రభుత్వం కొత్త హాస్టల్‌ను నిర్మించాలని నిర్ణయించిందని పన్షేరియా చెప్పారు. 236 మంది వైద్యులకు వసతి సౌకర్యాల తో కూడిన గ్రౌండ్–ప్లస్–8 అంతస్తుల హాస్టల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తారు. ఇందుకు గాను రూ. 51.84 కోట్లకు గాను, 2026–27 బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రూ. 34.65 కోట్లు కేటాయించారని పన్షేరియా పేర్కొన్నారు.స్మారక చిహ్నం నిర్మించాలి: మృతుల బంధువులులండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఏఐ–171 గతేడాది జూన్ 12న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ సముదాయంలో కూలిపోవడం, ప్రమాదంలో విమానంలోని 241 మంది, హాస్టల్లో ఉన్న 19 మంది మరణించడం, ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడటం తెలిసిందే. అయితే, ఆ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఒక స్మారక చిహ్నంగా పరిరక్షించాలని బాధితుల కుటుంబాలు కొన్ని కోరుతున్నాయి. ఈ మేరకు 115 మంది బాధితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక న్యాయ సంస్థ ద్వారా అధికారులకు ఈమెయిళ్లు పంపింది. ‘మాకు, ఆ ప్రదేశం కేవలం భూమి లేదా మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు. ఇది జీవితా లు, జ్ఞాపకాలు, దుఃఖం, పూడ్చలేని నష్టంతో ముడిపడి ఉన్న ప్రదేశం. కుటుంబాలకు జ్ఞాపకార్థ స్థలంగానే కాకుండా, ప్రాణాలు కోల్పోయిన వారికి, జవాబుదారీతనం, భద్రత యొక్క ప్రాముఖ్యతకు శాశ్వతమైన బహిరంగ గుర్తింపుగా కూడా ఒక స్మారక చిహ్నం ఉపయోగపడుతుంది’ అని ఈమెయిల్లో పేర్కొన్నారు. ప్రమాద స్థలం గురించి ఎలాంటి నిర్ణయ మైనా తీసుకునే ముందు తమను సంప్రదించాలని బంధువులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
సూట్‌కేస్‌లో గర్ల్‌ఫ్రెండ్
సోనిపట్: గర్ల్ ఫ్రెండ్‌ను సూట్‌కేస్‌లో దాచి తనుండే బాయ్స్ హాస్టల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఓ విద్యార్థి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన హరియాణా రాష్ట్రం సోనిపట్‌లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఇటీవల చోటుచేసుకుంది. భారీ సూట్‌కేస్‌తో హాస్టల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ విద్యార్థిని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సూట్‌కేస్ తెరిచేందుకు తీసేందుకు యత్నించారు. విద్యార్థులు చుట్టూ గుమికూడారు. సూట్‌కేస్ తెరిచి చూడగా ఓ యువతి బయటకు రావడంతో అంతా షాకయ్యారు. ఓ విద్యార్థి ఇదంతా వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వైరలయ్యింది. వర్సిటీ పీఆర్వో మాత్రం, ‘మా విద్యార్థులు అల్లరి చేశారంతే, ఇదేమంత పెద్ద విషయం కాదు’ అంటూ తేలిగ్గా కొట్టిపారేయడం విశేషం. -
80 చెంపదెబ్బలు కొట్టిన సీనియర్లు.. రెండో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి
దిస్పూర్: అస్సాం డిబ్రూగఢ్ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. సీనియర్ల టార్చర్ భరించలేక ఓ విద్యార్థి హాస్టల్ రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్రగాయాల పాలైన అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుడ్ని శివసాగర్ జిల్లా అమ్గూరికి చెందిన ఆనంద్ శర్మగా గుర్తించారు. ఈ యూనివర్సిటీలో ఎంకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే తమ కుమారుడ్ని సీనియర్లు వారం రోజులుగా వేధిస్తున్నారని అతని తల్లి తెలిపింది. ఆదివారం కూడా 80 చెంపదెబ్బలు కొట్టారని, కర్రలు, బాటిళ్లతో టార్చర్ చేశారని వెల్లడించింది. అది భరించలేకే తన కుమారుడు భవనం పైనుంచి దూకేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ర్యాగింగ్ విషయం గురించి హాస్టల్ వార్డెన్‌ను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆనంద్ శర్మ తల్లి వాపోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జితెన్ హజారికా చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం స్పందన.. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే ప్రధాన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని సీఎం హిమంత బిశ్వ శర్మ సూచించారు. పోలీసులు తక్షణమే విచారణ చేపట్టి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చదవండి: పెళ్లి చేసుకోకపోతే.. ముక్కలు ముక్కలు చేస్తా.. అమ్మాయికి బెదిరింపులు.. -
పరిక్షల్లో ఫెయిల్.. ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య
న్యూఢిల్లీ: మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ (ఎంఎఎంసీ)కి చెందిన 19 ఏళ్ల వైద్య విద్యార్థి గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీలోని ఉమెన్స్ హాస్టల్లో యువతి తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని దివ్య యాదవ్‌గా గుర్తించారు. డిసెంబర్ 29 సాయంత్రం విడుదలైన మెడికల్ విద్య పరీక్ష ఫలితాల్లో రెండు పేపర్లలో ఫెయిల్ అయ్యింది. అప్పటి నుంచి ఆమె డిప్రెషన్‌తో ఉన్నట్లు దివ్య రూమ్మేట్స్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం 64వ నంబర్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆమె గదిలో మొబైల్ ఫోన్, సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆమె తండ్రికి అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: (అనుమానంతో కూతుర్ని కాల్చి చంపిన తండ్రి) -
భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
చందానగర్: హాస్టల్ భవనంపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీందర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా, చేగుంట గ్రామానికి చెందిన శిల్ప (19)గౌతమీనగర్‌లోని బీఎస్ఆర్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ అశోక్‌నగర్‌లోని విజయ డయాగ్నోస్టిక్స్‌లో పని చేసేది. ఈ నెల 1న ఉద్యోగం మానేసిన ఆమె ప్రస్తుతం ఖాళీగా ఉంటోంది. మంగళవారం రాత్రి బిల్డింగ్ పై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని ఆమె స్నేహితుడు అనిల్ సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
స్పోర్ట్స్ హాస్టల్‌కు సుస్తీ
వరంగల్ స్పోర్ట్స్: హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఆవరణలో ఉన్న వరంగల్ రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్ భవనానికి సుస్తి చేసింది. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం కావడంతో శిథిలావస్థకు చేరింది. పగుళ్లు ఏర్పడి, పెచ్చులూడిన పైకప్పు నుంచి ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు భవనంలోని గోడలు తడిసి పాకురు పట్టాయి. అయినా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. నేడు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని హాస్టల్ స్థితిగతులు, క్రీడాకారుల వసతులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా చెప్పుకుంటున్న వరంగల్ అందుకు తగ్గట్టుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. క్రీడాకారులకు పెద్ద పీట, క్రీడల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్న పాలకుల హామీలు కాగితాల్లోనే పరిమితమయ్యాయి. జేఎన్‌ఎస్‌లోని వరంగల్ రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్లో అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, జిమ్నాస్టిక్స్ క్రీడల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ మూడు ఆటల క్రీడాకారుల్లో ప్రస్తుతం 108 మంది క్రీడాకారులు ఉంటున్నట్లు డీఎస్ఏ అధికారులు చెబుతున్నారు. అందులో 38మంది బాలికలు కాగా, మిగిలిన వారు బాలురు ఉంటున్నారు. సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోగా రెండేళ్ల క్రితం బాలురను స్టేడియం ఆవరణలో నిర్మించిన కొత్త భవనంలోకి మార్చారు. బాలికలు మాత్రం పాత భవనంలోనే ఉంటున్నారు. ఇందులోనే క్రీడాకారులకు భోజనం వడ్డిస్తుంటారు. ఇక కొత్తగా నిర్మించిన భవన నిర్మాణంలో జరిగిన లోపాల వల్ల వర్షాలు కురిసిన ప్రతీసారీ వర్షపు నీరు హాస్టల్ వరండాలోకి చేరుతోంది. దీంతో క్రీడాకారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఫస్ట్ ఎయిడ్ కిట్టు లేదు.. ప్రమాదకరంగా భావించే జిమ్నాస్టిక్తోపాటు సాధారణంగా గాయాలు తగిలే అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్ క్రీడాకారులకు కనీసం ప్రాథమిక చికిత్స అందించే మందులు లేవు. చిన్నపాటి దెబ్బలు తగిలినప్పుడు క్రీడాకారులకు అప్లై చేసే పెయిన్ కిల్లర్ జెల్ కూడా హాస్టల్ క్రీడాకారులకు అందుబాటులో లేదు. అంతేకాదు జ్వరమొస్తే వేసుకునే పారాసెటమాల్ టాబ్లెట్లు కూడా లేకపోవడం విశేషం. జ్వరమొచ్చినా, చిన్న పాటి గాయమైన సంబందిత కోచ్ క్రీడాకారుడిని వెంటబెట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 108 మంది క్రీడాకారుల హెల్త్బడ్జెట్ రూ.3 వేలే.. స్పోర్ట్స్ హాస్టల్లో ఉంటున్న 108 మంది క్రీడాకారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ రూ.3వేలే కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న తరుణంలో కనీసం డెంగీ పరీక్ష చేసి, పది రోజులకు మందులు వాడాలంటేనే ఒక్కరికి కూడా ఆ సొమ్ము సరిపోదన్న విషయం తెలిసిందే. అలాంటి సమయంలో క్రీడాకారుడికి మేజర్‌గా గాయాలైన, ఇంకేమైనా మొదట ఖర్చు చేసి ఆ తర్వాత ‘సాట్’కు బిల్లులు పంపిస్తే అప్పుడు ఖర్చులు వెచ్చిస్తుందట. ఇదీ మన ప్రభుత్వం క్రీడాకారుల సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యం. కొత్త భవనానికి ప్రతిపాదనలు పంపించాం శిథిలావస్థలో ఉన్న భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని కోరుతూ జిల్లా కలెక్టర్, సాట్ చైర్మన్, ఎండీలకు ప్రతిపాదనలు పంపించాను. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని వారానికోసారి స్పోర్ట్స్ హాస్టల్లో మెడికల్ క్యాంపు నిర్వహించాలని కోరాం. పిల్లలకు జ్వరం వచ్చినా, చిన్న గాయమైనా మేము దగ్గరుండి ఆస్పత్రికి తీసుకెళ్తాం. – ధనలక్ష్మి, డీవైఎస్ఓ, వరంగల్ అర్బన్ జిల్లా -
ప్రేమ వ్యవహారం.. భవనంపై నుంచి దూకిన యువతి
సాక్షి, హైదరాబాద్ : ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణం బలితీసుకుంది. తల్లిదండ్రుల కళ్ల ముందే హస్టల్ భవనంపై నుంచి దూకి పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం ముషీరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపిగుంటకు గ్రామానికి చెందిన మహ్మద్ సనా ముషీరాబాద్ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ పాలిటెక్నిక్ చదువుతోంది. సనా ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి బుధవారం కళాశాల దగ్గరకు వచ్చారు. దీంతో సనా తల్లిదండ్రుల ముందే హాస్టల్ భవనం మూడో అంతస్తు మీద నుంచి కిందకు దూకింది. తీవ్రగాయాలపాలైన ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. -
యువతి ప్రాణం బలితీసుకున్న ప్రేమ వ్యవహారం
-
అయ్యో.. గిరీష్
రాజాం సిటీ/ రూరల్/ కాకినాడ: ఆ కుటుంబంతో పాటు పొరుగున ఉన్న ఏ ఒక్క గ్రామంలోనూ ‘డాక్టర్’ చదువు చదివినోళ్లు లేరు. నిరుపేద కుటుంబమైనా తమ కుమారుడిని డాక్టర్ చేయాలనే లక్ష్యంతో ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. అతడిపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ యువకుడు ప్రస్తుత విద్యావిధానంలో నెలకొన్న మానసిక ఒత్తిడిని జయించలేక.. ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆ ఊరి ప్రజల ఆశల ను అడియాసలు చేస్తూ అనంతలోకాలకు వెళ్లిపోయాడు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థి లెంకా గిరీష్‌నాయుడు(21) హాస్టల్‌పై నుంచి దూకి గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. నిత్యం నవ్వుతూ సరదాగా, ఉత్సాహంగా ఉండే గిరీష్‌నాయుడు తమ మధ్య లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేని విద్యార్థులు తీవ్ర విషాదంలో పడిపోయారు. వ్యవసాయ కుటుంబం నుంచి... శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం అంతకాపల్లి పంచాయతీ మొగలి వలస గ్రామానికి చెందిన లెంక వెంకటరమణ, రాజేశ్వరి సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. వీరి పెద్దకుమారుడు శ్రీధర్ విశాఖలో ఇంజినీరింగ్ చదువుతుండగా, రెండో కుమారుడు గిరీష్‌నాయుడు కాకినాడలో వైద్య విద్యనభ్యసిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి విద్యపై మక్కువతో బాగా రాణించేవాడని, పదో తరగతిలో అత్యుత్తమ మార్కులతోపాటు, ఏపీఆర్జేసీకి ఎంపికై విజయవాడలో ఇంటర్ చదివాడు. అక్కడ కూడా మంచి ర్యాంకులు సాధించి మెడిసిన్‌లో 200లోపు ర్యాంకు సాధించి ప్రభుత్వ కోటాలో కాకినాడ ఆర్ఎంసీలో వైద్య విద్యార్థిగా చేరాడు. ప్రాణం తీసిన సెమిస్టర్ పరీక్ష వైద్య విద్య ద్వితీయ సంవత్సరంలోని సెమిస్టర్ పరీక్ష గిరీష్‌నాయుడు ఆత్మహత్యకు కారణమైందని తోటి విద్యార్థులంటున్నారు. వాస్తవానికి ద్వితీయ సంవత్సరం సెమిస్టర్ విధానంలో ప్రతీ ఆరు నెలలకు రెండేసి సెమిస్టర్లు ఉండేవని, అయితే ఈసారి నాలుగు సెమిస్టర్ పరీక్షలు ఒకేసారి నిర్వహించాలన్న నిర్ణయంతో గిరీష్‌నాయుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనట్టు తెలిసింది. శుక్రవారం మైక్రో బయాలజీ పరీక్ష రాయాల్సి ఉందని, ఒక అంశంపై ఎన్నిసార్లు కసరత్తు చేసినా ఫలితంలేకపోతుందంటూ ఆత్మహత్యకు ముందు తోటి విద్యార్థుల వాపోయినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 6–7 గంటల సమయంలో హాస్టల్లోని టెర్రస్‌పైకి ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్రీడల్లో రాణింపు: చదువుతోపాటు క్రీడల్లో కూడా గిరీష్ బాగా రాణించేవాడని తోటి విద్యార్థులు చెప్పారు. గత ఏడాది డిసెంబర్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన క్రీడాపోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో ప్రతిభ చాటాడని చెబుతున్నారు. స్పోర్ట్స్ సెక్రటరీగా కూడా గిరీష్ వ్యవహరించే వాడని చెప్పారు. అలుముకున్న విషాదం గిరీష్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వాస్తవాన్ని తోటి విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంఘటన స్థలంలో, ఆ తరువాత కాకినాడ మార్చురీ వద్ద గిరీష్ స్నేహితులు విలపించారు. కాకినాడలోని ఐడీబీఐ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న గిరీష్ మామయ్య వరహాలనాయుడు సమాచారం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆర్ఎంసీలో ఇది రెండో ఘటన విద్యలో ఎదురయ్యే మానసిక ఒత్తిడితో కాకినాడ ఆర్ఎంసీలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం రెండోసారని విద్యార్థుల ద్వారా తెలిసింది. సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఒక విద్యార్థిని ఇదే తరహాలో ఆత్మహత్యకు పాల్పడిందని, ఇప్పుడు ఇది రెండో సంఘటన అని చెబుతున్నారు. మెడికో మరణంతో స్వగ్రామంలో విషాదం రాజాం సిటీ: లెంక గిరీష్‌కుమార్ (20) కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారంతో గ్రామంలో విషాదం నెలకొంది. లెంక వెంకటరమణ, రాజేశ్వరమ్మలు వ్యవసాయం చేసుకుంటూ తన ఇద్దరు కుమారులను ఉన్నతులుగా చూడాలన్న కోరికతో ఉన్నత చదువులు చదివిస్తున్నారు. గిరీష్ వైద్యవిద్యలో చేరి గ్రామానికి మంచిపేరు తెస్తాడనుకున్న తరుణంలో ఈ మృతివార్త విషాదాన్ని నింపింది. గిరిష్ మృతిచెందాడన్న సమాచారంతో తండ్రి కుప్పకూలిపోయాడు. చదువులో ముందుండే గిరీష్ ఎందుకు ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడోనని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదని, ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి సీటు సంపాదించాడని కన్నవారు తెలిపారు. గిరీష్ మృతిచెందిన విషయం గుండెకు సంబంధించి వ్యాధితో బాదపడుతున్న తన తల్లి రాజేశ్వరికి తెలియకుండా ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ గ్రామస్థులు ఆందోళన తీవ్రతరం కావడంతో ఆమె పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన పలువురిలో వ్యక్తమౌతుంది. విషయం తెలిసిన వెంటనే తండ్రి వెంకటరమణతోపాటు సోదరుడు శ్రీధర్, బంధువుల హుటాహుటిన కాకినాడకు బయలుదేరి వెళ్లారు. -
హాస్టల్లో ఉండటం ఇష్టం లేకే..?
నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్‌లోగల శ్రీ మేధా జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదు వుతున్న విద్యార్థిని రుచిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కళాశాల నాలుగో అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు, విద్యార్థులు, కళాశాల యాజమాన్యం ప్రయివేటు ఆస్ప త్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి దాసరి ఒడ్డెన్న ఘటనా స్థలానికి వెళ్లి తోటి విద్యార్థులతో విచారణ చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యాయ త్నం చేసుకున్న ఘటన జిల్లాలో కలకలం రేపింది. వినాయక్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): ఆర్మూర్ మండలం పెర్కిట్‌కు చెందిన రాజేశ్వర్ తన కూతురు రుచితను నగరంలోని శ్రీమేధ జూనియర్ కళాశాల హాస్టల్లో చేర్చారు. విద్యార్థిని గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కళాశాల భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే వాకింగ్‌కు వచ్చిన వారంతా గుమిగూడారు. దీన్ని గమనించిన వైద్యులు ప్రేమానందం తన కారులో విద్యార్థినిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం విద్యార్థినికి వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థిని రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయినట్లు, మూడు పక్కటెముకులు విరిగినట్లు వైద్యులు తెలిపారు. రక్త స్రావం అధికంగా కావడంతో విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న నాలుగో టౌన్ ఎస్ఐ నరేష్ విద్యార్థిని వాంగ్మూలం తీసుకునేందుకు జడ్జిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. విద్యార్థిని స్పృహలోకి రాకపోవడంతో వారు వెనుదిరిగారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఇంటర్ విద్యాధికారి ఒడ్డెన్న విచారణ చేపట్టారు. సాయంత్రం ఆస్పత్రి వచ్చిన ఒడ్డెన్న విద్యార్థినిని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు, కళాశాల యాజమాన్యంతో ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం ఘటనాస్థలానికి వెళ్లి తోటి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రుచిత చదువులోనూ, ఆరోగ్యపరంగా చురుగ్గా ఉండేదని వారు తెలిపారు. కళాశాల యాజమాన్యం ఎలాంటి ఒత్తిళ్లకు గురిచేయలేదని, ఆమె అలా ఎందుకు చేసుకుందో అర్థం కావడంలేదని సమాధానమిచ్చారు. ఇదేవిషయమై కళాశాల డైరెక్టర్ భూపతిరెడ్డిని అడగగా మూత్రశాలకు వెళ్లిన రుచిత కళాశాలపై నుంచి పడిన విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్నానన్నారు. ప్రస్తుతం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. చదువు, ఫీజు విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు చేయలేదన్నారు. నాలుగో టౌన్ పోలీసులు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. హాస్టల్లో ఉండటం ఇష్టం లేకనే..? ఇటీవలే విద్యార్థిని తనకు హాస్టల్లో ఉండటం ఇష్టం లేదని తన తల్లితో చెప్పినట్లు సమాచారం. మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులను అడిగే ప్రయత్నం చేయగా వారు వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. -
సైన్స్ కాలేజీలో రూ.10 కోట్లతో హాస్టల్ భవనం
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా సైఫాబాద్‌లో ఉన్న సైన్స్ కాలేజీలో మరో హాస్టల్ భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మయ్య తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్థి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అందించనున్న రూ.8 కోట్ల నిధులకు తోడు యూనివర్సిటీ నుంచి రూ.2 కోట్లు రానున్నాయని ఆయన వివరించారు. ఈ మొత్తం రూ.10 కోట్లతో విద్యార్థులకు కొత్త హాస్టల్ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఒకే హాస్టల్ భవనంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు వసతి కల్పించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. మంత్రి ప్రకటించిన మేరకు నిధులు అందిన వెంటనే వచ్చే మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ఆయన శనివారం 'సాక్షి'కి వెల్లడించారు. -
తండ్రి రెండో పెళ్లి.. కూతురి ఆత్మహత్యాయత్నం!
కూకట్పల్లి(హైదరాబాద్): తండ్రి రెండో వివాహం చేసుకున్నందున మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. కూకట్‌పల్లిలోని బాలాజీ నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉండే శిరీష, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు వెళుతుంది. అయితే శిరీష తండ్రి ఇటీవల రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన శిరీష ఈ రోజు హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి యత్నించింది. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కుప్పకూలిన హాస్టల్ భవనం : విద్యార్థులు సురక్షితం
కాకినాడ : కాకినాడ నగరం సాంబమూర్తినగర్లోని ప్రభుత్వ బధిరుల పాఠశాలలోని హాస్టల్ భవనం కుప్పకూలింది. అయితే భవనంలోని 46 మంది విద్యార్థులు సురక్షితంగా ఉన్నారు. విద్యార్థులు స్నానాలు చేస్తున్న సమయంలో భవనం కూలడంలో పెద్ద ప్రమాదం తప్పింది. హాస్టల్ భవనం ఆదివారం ఉదయం 6.00 గంటల సమయంలో కూలిందని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. -
నత్తనడకన ‘ఇందిరమ్మ
విద్యా నిలయం’ పనులు మొయినాబాద్: కళాశాల విద్యార్థినుల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న ‘ఇందిరమ్మ విద్యా నిలయం’ హాస్టల్ భవనం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై ఎనిమిది నెలలు దాటినా ఇప్పటికీ పునాదులకే పరిమితమయింది. కళాశాలల్లో చదివే విద్యార్థుల వసతి కోసం ఇందిరమ్మ విద్యా నిలయాలు నిర్మించేందుకు గత ఏడాది అప్పటి ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా జిల్లాలో ఆరు హాస్టల్ భవనాలను నిర్మించేం దుకు ప్రణాళికలు సిద్ధం చేసి, ఒక్కో భవనానికి రూ. 2.50 కోట్ల నిధులు కేటాయించింది. వాటిలో ఒకటి మొయినాబాద్‌లో బాలికల కోసం నిర్మించేందుకు మంజూరు చేశారు. దాంతో భవన నిర్మాణంకోసం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అర ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ భవన నిర్మాణానికి గత సంవత్సరం నవంబర్ 14న అప్పటి జిల్లా చేనేత, జౌళి శాఖ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ శంకుస్థాన చేశారు. ప్రభుత్వం ఈ భవన నిర్మాణ పనుల పర్యవేక్షణను వైద్య, ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించింది. నెల రోజుల్లోపే టెండర్లు పూర్తి కావడంతో వెం టనే పనులు ప్రారంభించారు. కానీ ఆ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్‌లోపు ఈ భవనం పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం నడుస్తున్న పనులను బట్టిచూస్తే మరో సంవత్సరం పాటు భవని ని ర్మాణ పనులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నాలుగు నెలల క్రితం పనులను పరిశీలించేందుకు వచ్చిన వైద్య, ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆనందర్‌కుమార్ పనులు వేగవంతం చేయాలని, డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచిం చారు. అయినా పనులు మందకొడిగానే సాగుతుండడంతో వచ్చే విద్యా సంవత్సరంలోనైనా ఈ భవనం విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందో రాదోననే సందేహం నెలకొంది. -
ఆరిన విద్యాకుసుమం
ఎం.గౌరారం(కనగల్), న్యూస్‌లైన్: ఎందరికో వెలుగులు పంచాల్సిన ఆ విద్యాకుసుమం మధ్యలోనే ఆరిపోయింది. తమ కుమారుడు మంచి స్థితిలో ఉండాలని కూలినాలి చేసి ఉన్నత చదువు చదివిస్తున్న ఆ తల్లిదండ్రుల ఆశ నెరవేరకుండానే ఈ లోకాన్ని వీడాడు. ఉన్నత ఉద్యోగంలో స్థిరపడి మిమ్మల్ని మంచిగా చూసుకుంటానని అమ్మానాన్నలతో ఫోన్లో చెప్పిన కొన్ని గంటల్లోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా బాసర ఐఐటీలో చదువుతున్న ఎం.గౌరారం విద్యార్థి శనివారం రాత్రి హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. కనగల్ మండలం ఎం. గౌరారానికి చెందిన బొమ్మపాల వెంకటయ్య-జయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. కూలినాలి చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరిలో పెద్దకొడుకు నాగరాజు(21) 2008లో కనగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి అత్యున్నత మార్కులు సాధించడంతో బాసర ఐఐటీలో సీటు వచ్చింది. ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శనివారం రాత్రి ఐఐటీలోని హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన నాగరాజును చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మేనత్త కూతురితో పెళ్లి నిశ్చయం నాగరాజుకు ఇటీవల మేనత్త కూతురితో పెళ్లి కుదిరింది. ఈ నెల 26న వివాహం నిశ్చయమై నప్పటికీ అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఇదే విషయమై శనివారం రాత్రి 8 గంటల సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడాడు. వచ్చే నెల 5న లగ్నం పెట్టుకోవాలని నాగరాజు తమతో చెప్పినట్లు అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కూలినాలి చేసుకుంటూ కొడుకును చదివించామని, అతని ఇష్టప్రకారమే పెళ్లి నిశ్చయం చేశామని వారు రోదించారు. ఇంతలోనే తమ కుమారుడు కనిపంచని లోకాలకు వెళ్లిపోయాడని వారు కన్నీరుమున్నీరయ్యారు. మృతిపై అనుమానాలు నాగరాజు మృతిపై అతని కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి సంఘటన జరిగితే ఆదివారం ఉదయం వరకు తమకు చెప్పలేదన్నారు. కళాశాల యాజమాన్యం సరైన సమాచారం ఇవ్వడం లేదని వారు తెలిపారు.


