కాకినాడ నగరం సాంబమూర్తినగర్లోని ప్రభుత్వ బధిరుల పాఠశాలలోని హాస్టల్ భవనం కుప్పకూలింది.
కాకినాడ : కాకినాడ నగరం సాంబమూర్తినగర్లోని ప్రభుత్వ బధిరుల పాఠశాలలోని హాస్టల్ భవనం కుప్పకూలింది. అయితే భవనంలోని 46 మంది విద్యార్థులు సురక్షితంగా ఉన్నారు. విద్యార్థులు స్నానాలు చేస్తున్న సమయంలో భవనం కూలడంలో పెద్ద ప్రమాదం తప్పింది. హాస్టల్ భవనం ఆదివారం ఉదయం 6.00 గంటల సమయంలో కూలిందని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.