సైన్స్ కాలేజీలో రూ.10 కోట్లతో హాస్టల్ భవనం | Rs. 10 cr. sanctioned for hostel building | Sakshi
Sakshi News home page

సైన్స్ కాలేజీలో రూ.10 కోట్లతో హాస్టల్ భవనం

Dec 12 2015 3:48 PM | Updated on Sep 3 2017 1:53 PM

ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా సైఫాబాద్‌లో ఉన్న సైన్స్ కాలేజీలో మరో హాస్టల్ భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మయ్య తెలిపారు.

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా సైఫాబాద్‌లో ఉన్న సైన్స్ కాలేజీలో మరో హాస్టల్ భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మయ్య తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్థి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అందించనున్న రూ.8 కోట్ల నిధులకు తోడు యూనివర్సిటీ నుంచి రూ.2 కోట్లు రానున్నాయని ఆయన వివరించారు.

ఈ మొత్తం రూ.10 కోట్లతో విద్యార్థులకు కొత్త హాస్టల్ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఒకే హాస్టల్ భవనంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు వసతి కల్పించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. మంత్రి ప్రకటించిన మేరకు నిధులు అందిన వెంటనే వచ్చే మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ఆయన శనివారం 'సాక్షి'కి వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement