breaking news
Jindal Global University
-
వ్యక్తిత్వానికి ఆభరణం నిజాయతీ
సోనీపట్: మనుషులు ఎల్లవేళలా నిజాయతీ కి, క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. నిజాయతీ అనేది మనిషి వ్యక్తిత్వానికి విలువైన ఆభరణం లాంటిదని చెప్పారు. అంతేకాకుండా న్యాయం, ఖ్యాతిని కాపాడుతుందని అన్నారు. న్యాయ శాస్త్రం అభ్యసిస్తున్న విద్యార్థులు నిజాయతీని తమ జీవితాల్లో అంతర్భాగంగా మార్చుకో వాలని పిలుపునిచ్చారు. హరియాణా రాష్ట్రం సోనీపట్‌లోని ఓ.పి.జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో న్యాయ వ్యవస్థ స్వతంత్రపై శనివారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో జస్టిస్ సూర్యకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయ శాస్త్రంపై చర్చల కోసం న్యాయాభ్యాస మండపాన్ని ప్రారంభించారు. అలాగే ఇంటర్నేషనల్ మూటింగ్ అకాడమీ ఫర్ అడ్వొకసీ, నెగోషియేషన్, డిస్ప్యూట్ అడ్జుడికేషన్, అర్బిట్రేసన్, రిసొల్యూ సన్ (ఇమాన్దార్)కు శ్రీకారం చుట్టారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, ఎంపీ, యూనివర్సిటీ చా న్సలర్ నవీన్ జిందాల్, పలువురు న్యాయని పుణులు, న్యాయవాదు లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగిస్తూ.. నిజాయతీ ప్రాముఖ్యతను వివరించారు. ఎవరూ చూడనప్పుడు మనం ఏం చేస్తామో అదే నిజాయతీ, చుట్టూ ఉన్న అందరూ చూస్తుండగా చేసేది సాహసం అని పేర్కొన్నారు. నిజాయతీ అనే ఒక్క పదానికి నైతికంగా ఎంతో విలువ ఉందన్నారు. సత్యం, జ్ఞానం పరస్పరం పోటీ పడాలి నేడు టెక్నాలజీ యుగంలో డీఫ్ ఫేక్ ఫోటోలు, వీడియోల బెడద పెరిగిపోయిందని జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తంచేశారు. తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతోందని అన్నారు. ప్రతిరోజూ దేశంలో ఏదో ఒకచోట డిజిటల్ అరెస్టులు చోటు చేసుకుంటున్నాయని చె ప్పారు. ఇలాంటి పరి స్థితుల్లో సత్యం, జ్ఞానం పరస్పరం పోటీ పడా లని ఉద్ఘాటించారు. నీతి నిజాయతీ అనేవి కేవలం మాటల్లో చెప్పుకొనే ఆదర్శాలు కాదని, మనిషి మనగడకు అవి ముఖ్య సాధనాలు అని స్పష్టంచేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నిజాయతీని వదు లుకోవద్దని న్యాయ విద్యార్థులకు సూచించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవాలని అన్నారు. రాజ్యాంగ పరిషత్‌లోని 15 మంది మహిళా సభ్యులలో ఒకరైన దుర్గాబాయి దేశ్‌ముఖ్ చెప్పిన మాటలను జస్టిస్ సూర్యకాంత్ గుర్తుచేశారు. స్వతంత్రంగా ఉన్నట్లు న్యాయ వ్యవస్థ భావించాలని స్పష్టంచేశారు. న్యాయ వ్యవస్థ ఇతరుల ఒత్తిళ్లు, ప్రలోభాకలు లొంగకుండా స్వతంత్రంగా పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని తేల్చిచెప్పారు. కాలం మారుతున్నప్పటికీ న్యాయ వ్వవస్థ ప్రజల విశ్వాసం కోల్పోవద్దని పేర్కొన్నారు. -
సూట్‌కేస్‌లో గర్ల్‌ఫ్రెండ్
సోనిపట్: గర్ల్ ఫ్రెండ్‌ను సూట్‌కేస్‌లో దాచి తనుండే బాయ్స్ హాస్టల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఓ విద్యార్థి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన హరియాణా రాష్ట్రం సోనిపట్‌లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఇటీవల చోటుచేసుకుంది. భారీ సూట్‌కేస్‌తో హాస్టల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ విద్యార్థిని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సూట్‌కేస్ తెరిచేందుకు తీసేందుకు యత్నించారు. విద్యార్థులు చుట్టూ గుమికూడారు. సూట్‌కేస్ తెరిచి చూడగా ఓ యువతి బయటకు రావడంతో అంతా షాకయ్యారు. ఓ విద్యార్థి ఇదంతా వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వైరలయ్యింది. వర్సిటీ పీఆర్వో మాత్రం, ‘మా విద్యార్థులు అల్లరి చేశారంతే, ఇదేమంత పెద్ద విషయం కాదు’ అంటూ తేలిగ్గా కొట్టిపారేయడం విశేషం. -
గర్భధారణపై మహిళకే హక్కు
సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ సిక్రి వెల్లడి న్యూఢిల్లీ: పిల్లల్ని కనాలా? వద్దా? అబార్షన్ చేయించుకోవాలా? గర్భనిరోధక పద్ధతులు పాటించాలా? అనేవన్నీ మహిళల ఇష్టాన్ని బట్టి ఉంటుందని, అది వారి హక్కు అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రి అన్నారు. శనివారం ఇక్కడ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గర్భధారణ విషయంలో దేశంలో మహిళల హక్కు అరుదుగా అమలవుతోందన్నారు.ఈ విషయంలో మానవత్వం ప్రదర్శించడంలో మనం విఫలమయ్యామన్నారు. దేశంలో మహిళల గర్భధారణ హక్కు విషయంలో పురుషులు లేదా ఇంటి పెద్దల అభిప్రాయమే చెల్లుబాటవుతుందని అన్నారు. గర్భధారణ మహిళ శరీరానికి సంబంధించినదని, అది ఆమె అభిప్రాయం మేరకే జరగాలని జస్టిస్ సిక్రి చెప్పారు. భార్యాభర్తలిద్దరు కలసి నిర్ణయం తీసుకున్నపుడే సమానత్వం అనేది సాధ్యమవుతుందన్నారు. సమాజంలో మార్పు వచ్చే వరకూ చట్టాల్లోని ఫలాలు మహిళలకు అందుబాటులోకి రావని అభిప్రాయపడ్డారు. -
ఆ సెల్ ఫోన్లు ఎందుకు సీజ్ చేయలేదు?
న్యూఢిల్లీ: హర్యానాలోని జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఎంబీఏ విద్యార్థినిపై సీనియర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి 21 ఏళ్ల విద్యార్థినిపై సీనియర్, అతడి స్నేహితులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఏడాదిన్నరపైగా జరిగిన ఈ దారుణోదంతం వెలుగు చూసింది. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని న్యాయస్థానికి బాధితురాలు మొరపెట్టుకుంది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. స్టేటస్ నివేదిక సమర్పించాలని హర్యానా పోలీసులను ఆదేశించింది. నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. తన ఫోటోలు బయటపెడతారన్న భయంతోనే ఇన్నాళ్లు ఫిర్యాదు చేయలేదని తెలిపింది. ఇది సీరియస్ కేసు అని, నిందితుల సెల్ ఫోన్లు ఎందుకు సీజ్ చేయలేదని హర్యానా పోలీసులను జస్టిస్ ఏకే సిక్కి, జస్టిస్ యుయు లలిత్ లతో కూడిన బెంచ్ ప్రశించింది. వెంటనే స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది.


