మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బాటిల్‌పై రూ.10 తగ్గింపు | Good News For Alcohol Lovers In Tamil Nadu, Ten Rupees Discount On A Bottle Amid Rising Crowds | Sakshi
Sakshi News home page

Tamil Nadu: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బాటిల్‌పై రూ.10 తగ్గింపు

Sep 8 2026 9:21 AM | Updated on Sep 8 2026 9:37 AM

Good news for alcohol lovers Ten Rupes discount on a bottle

గత వారం నుండి తమిళనాడు వ్యాప్తంగా ఉన్న టాస్మాక్‌ దుకాణాలు ప్రతి బాటిల్‌పై అదనంగా రూ. 10 వసూలు చేయకుండా పరిమితం చేశారు. అయితే, ప్రభుత్వ ఉత్తర్వును ఉల్లంఘించి మద్యం ప్రియుల నుండి రూ. 10 వసూలు చేసినందుకు కొందరిని తాత్కాలికంగా ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. ప్రభుత్వ చర్యతో ప్రజల్లో మద్యం ఆదరణ పెరగడంతో, టాస్మాక్‌ దుకాణాల వద్ద రద్దీ కూడా పెరిగింది.

రాత్రి 8 గంటలకు జనం అదుపు తప్పుతున్నారు. రాత్రి 10 గంటలకు కూడా జనం గుమిగూడటంతో దుకాణాలను మూయలేని పరిస్థితి ఏర్పడి సమస్య తలెత్తుతోంది. అందువల్ల, పోలీసు భద్రతతో మాత్రమే దుకాణాలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెన్నైలోని టాస్మాక్‌ దుకాణాలలో సాయంత్రం 6 గంటల తర్వాత రద్దీ పెరుగుతుంది. ఈనేపథ్యంలో చాలా దుకాణాలకు పోలీసు భద్రత కల్పిస్తున్నారు. రద్దీని నివారించడానికి మద్యం దుకాణాల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. 

గతంలో మద్యం కొనుగోలు చేయడానికి వినియోగదారులు వరుసలో నిలబడి, సరిగ్గా చిల్లర చెల్లించాలని కోరుతూ ఒక నోటీసు బోర్డును కూడా ఏర్పాటు చేశారు. తాజాగా టాస్మాక్‌ ఉద్యోగులు గరిష్ట ధర కంటే ఎక్కువ వసూలు చేయడం కొనసాగిస్తే, వారిని తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తామని, అదే తప్పును రెండోసారి చేస్తే శాశ్వతంగా ఉద్యోగాల నుండి తొలగిస్తామని ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement