నిన్ను చంపేందుకు రూ.10 కోట్ల ఆఫర్‌ వచ్చింది | Police Revealed That Former Karnataka MLC Kidnapped And Forced To Pay ₹2 Crore To Escape, More Details | Sakshi
Sakshi News home page

నిన్ను చంపేందుకు రూ.10 కోట్ల ఆఫర్‌ వచ్చింది

Jun 3 2026 9:21 AM | Updated on Jun 3 2026 9:51 AM

Former MLC says armed men abducted him in Bengaluru

 బొమ్మనహళ్ళి: బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్‌ తాలూకాలోని హుసూ్కరు వద్ద మాజీ ఎమ్మెల్సీని కొందరు దుండగులు అపహరించి, డబ్బు డిమాండ్‌ చేశారు. వివరాలు.. మాజీ ఎమ్మెల్సీ దయానంద్‌ రెడ్డి  సోమవారం అర్ధరాత్రి గోల్డ్‌ కాయిన్‌ క్లబ్‌ నుంచి కారులో బయల్దేరారు. ఈ సమయంలో, బైక్‌పై వచ్చిన దుండగులు కారును అడ్డగించి, మీకు బహుమతి వచ్చిందని చెబుతూ ఆయనకు ఒక పెట్టెను చూపించారు. డోర్‌ లాక్‌ తెరుస్తుండగా, ఒక వ్యక్తి కారులోకి ప్రవేశించి,  తుపాకీ గురిపెట్టి, తాను చెప్పిన చోటుకు వెళ్లాలని చెప్పాడు. ఆ తర్వాత, ఎర్ర కారులో మరో ఇద్దరు వ్యక్తులు వెంబడించారు.

 అత్తిబెలె కేహెచ్‌బీ బరంగాయ్‌ సమీపానికి తీసుకెళ్లి, నిన్ను హత్య చేయడానికి రూ.10 కోట్ల ఆఫర్‌ వచ్చిందని చెప్పారు. దీంతో భయపడిన దయానంద్‌ రెడ్డి ఆ డబ్బును తానే ఇస్తానని, తనను చంపవద్దని వేడుకున్నారు. చివరకు రూ.2  కోట్లు ఇవ్వడానికి కుదిరింది. అయితే ఇప్పుడు డబ్బులు లేవని, సోమవారం బ్యాంకు నుంచి తీసుకుని ఇస్తానని ఆయన చెప్పడంతో వదిలిపెట్టారు. వెంటనే ఆయన స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలింపు  సాగిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement