సన్‌ రైజ్‌ సెక్టార్‌గా మత్స్య రంగం | Fisheries sector acknowledged as a Sunrise Sector | Sakshi
Sakshi News home page

సన్‌ రైజ్‌ సెక్టార్‌గా మత్స్య రంగం

Oct 5 2025 6:47 AM | Updated on Oct 5 2025 6:47 AM

Fisheries sector acknowledged as a Sunrise Sector

దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి జీవనోపాధి

ఏటా రూ.60 వేల కోట్ల ఎగుమతులు.. 

ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారత్‌..

సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ, ’సన్‌రైజ్‌ సెక్టార్‌’గా మత్స్య రంగం శరవేగంగా అభివద్ధి చెందుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 3 కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తూ, ప్రపంచ చేపల ఉత్పత్తిలో 8% వాటాతో భారత్‌ రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది. 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల ఫలితంగా ఈ రంగంలోకి రూ. 38,572 కోట్ల పెట్టుబడులు రాగా, 2023– 24లో మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.60,524 కోట్లకు చేరాయి. ఏటా 8.74% వృద్ధి రేటుతో దూసుకెళ్తున్న ఈ రంగంలో సుస్థిర అభివద్ధిని సాధించేందుకు కేంద్రం నడుం బిగించింది. 

ఈ వృద్ధిని మరింత వేగవంతం చేసి, క్షేత్రస్థాయిలో మత్స్యకారులు, రైతులను భాగస్వాములను చేసేందుకు కేంద్ర మత్స్యశాఖ ఒక బహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ అభిలక్ష్ లిఖి నేతృత్వంలో 2025 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఆరు నెలల పాటు దేశవ్యాప్తంగా వర్చువల్‌ సమావేశాలు నిర్వహించారు. 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 15,000 మందికి పైగా మత్స్యకారులు, ఆక్వా రైతులు, పరిశ్రమల ప్రతినిధులు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను, సవాళ్లను నేరుగా ప్రభుత్వానికి నివేదించారు.

క్షేత్రస్థాయిలో అందిన కీలక సూచనలు
సమావేశాల్లో మత్స్యకారులు తమ కు అవసరమైన మద్దతుపై స్పష్టమైన సూచనలు చేశారు. నాణ్యమైన చేప పిల్లలు, తక్కువ ధరకే మేత, కోల్డ్‌ స్టోరే జీలు, రవాణా సౌకర్యాలు మెరుగుపర చాలని కోరారు. డ్రోన్లు, శాటిలైట్‌ టెక్నా లజీ వంటి ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేవాలని, ప్రభుత్వం ఉచి తంగా అందించిన ట్రాన్స్‌పాండర్లు తమ భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతు న్నాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక మార్కెట్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని, సముద్రపు నాచు, అలంకార చేపల పెంపకం వంటి ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను ప్రోత్సహించాలని కోరారు.

రైతు కేంద్రంగానే మా విధానాలు: డాక్టర్‌ అభిలక్ష్ లిఖి
ఈ సందర్భంగా డాక్టర్‌ అభిలక్ష్ లిఖి మాట్లాడుతూ, ’మత్స్యకారులు, విధాన రూపకర్తల మధ్య ఈ సమావేశాలు బలమైన వారధిని నిర్మించాయి. క్షేత్రస్థాయి నుంచి అందిన ఈ సూచనలు ’వికసిత భారత్‌ 2047’లక్ష్యానికి అనుగుణంగా మా భవిష్యత్‌ ప్రణాళికలకు దిక్సూచిగా నిలుస్తాయి. ఈ రంగంలో వృద్ధి సమ్మిళితంగా, రైతు కేంద్రంగా ఉండేలా చూస్తాం’అని తెలిపారు. మొత్తంగా, భారీ పెట్టుబడులతో పాటు క్షేత్రస్థాయి భాగస్వామ్యంతో మత్స్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ ప్రణాళికతో ముందుకు సాగుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement