breaking news
Fisheries Department officials
-
సన్ రైజ్ సెక్టార్‌గా మత్స్య రంగం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ, ’సన్‌రైజ్ సెక్టార్’గా మత్స్య రంగం శరవేగంగా అభివద్ధి చెందుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 3 కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తూ, ప్రపంచ చేపల ఉత్పత్తిలో 8% వాటాతో భారత్ రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది. 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల ఫలితంగా ఈ రంగంలోకి రూ. 38,572 కోట్ల పెట్టుబడులు రాగా, 2023– 24లో మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.60,524 కోట్లకు చేరాయి. ఏటా 8.74% వృద్ధి రేటుతో దూసుకెళ్తున్న ఈ రంగంలో సుస్థిర అభివద్ధిని సాధించేందుకు కేంద్రం నడుం బిగించింది. ఈ వృద్ధిని మరింత వేగవంతం చేసి, క్షేత్రస్థాయిలో మత్స్యకారులు, రైతులను భాగస్వాములను చేసేందుకు కేంద్ర మత్స్యశాఖ ఒక బహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్ అభిలక్ష్ లిఖి నేతృత్వంలో 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల పాటు దేశవ్యాప్తంగా వర్చువల్ సమావేశాలు నిర్వహించారు. 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 15,000 మందికి పైగా మత్స్యకారులు, ఆక్వా రైతులు, పరిశ్రమల ప్రతినిధులు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను, సవాళ్లను నేరుగా ప్రభుత్వానికి నివేదించారు.క్షేత్రస్థాయిలో అందిన కీలక సూచనలుసమావేశాల్లో మత్స్యకారులు తమ కు అవసరమైన మద్దతుపై స్పష్టమైన సూచనలు చేశారు. నాణ్యమైన చేప పిల్లలు, తక్కువ ధరకే మేత, కోల్డ్ స్టోరే జీలు, రవాణా సౌకర్యాలు మెరుగుపర చాలని కోరారు. డ్రోన్లు, శాటిలైట్ టెక్నా లజీ వంటి ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేవాలని, ప్రభుత్వం ఉచి తంగా అందించిన ట్రాన్స్పాండర్లు తమ భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతు న్నాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక మార్కెట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని, సముద్రపు నాచు, అలంకార చేపల పెంపకం వంటి ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను ప్రోత్సహించాలని కోరారు.రైతు కేంద్రంగానే మా విధానాలు: డాక్టర్ అభిలక్ష్ లిఖిఈ సందర్భంగా డాక్టర్ అభిలక్ష్ లిఖి మాట్లాడుతూ, ’మత్స్యకారులు, విధాన రూపకర్తల మధ్య ఈ సమావేశాలు బలమైన వారధిని నిర్మించాయి. క్షేత్రస్థాయి నుంచి అందిన ఈ సూచనలు ’వికసిత భారత్ 2047’లక్ష్యానికి అనుగుణంగా మా భవిష్యత్ ప్రణాళికలకు దిక్సూచిగా నిలుస్తాయి. ఈ రంగంలో వృద్ధి సమ్మిళితంగా, రైతు కేంద్రంగా ఉండేలా చూస్తాం’అని తెలిపారు. మొత్తంగా, భారీ పెట్టుబడులతో పాటు క్షేత్రస్థాయి భాగస్వామ్యంతో మత్స్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. -
రావణకాష్టం
♦ పులికాట్ సరిహద్దుల్లో మరోమారు సరిహద్దుల వివాదం ♦ కత్తులు దూస్తున్న ఇరు రాష్ట్రాల జాలర్లు ♦ పట్టించుకోని ప్రభుత్వాలు సూళ్లూరుపేట... ఆంధ్రా-తమిళనాడు రాష్ట్రాల పరిధిలో సుమారు 640 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన పులికాట్ సరస్సులో చేపలవేట సాగించే ఇరు రాష్ట్రాల జాలర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సరిహద్దుల వివాదంతో కక్షలు పెంచుకుంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. అయితే రెండు రాష్ట్రాల జాలర్ల మధ్య తరచూ సరిహద్దుల వివాదం పదే పదే తలెత్తడానికి రెండు రాష్ర్ట ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరే కారణంగా కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితులతో సరస్సులో నీటిమట్టం తగ్గినపుడల్లా ఈ వివాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తమిళనాడులోని పెద్ద మాంగోడు, చిన్నమాంగోడు, కీరపాకపుదుకుప్పాలకు చెందిన జాలర్లు ఈ సరిహద్దు వివాదానికి కారకులవుతున్నారు. సరస్సుకు ఉత్తరంవైపు మత్స్య సంపద లేకపోవడంతో దక్షిణంవైపు సరస్సుకు వేటకు వెళుతున్నారు. పులికాట్ సరస్సులో ఆంధ్రా పరిధిలోని కురివితెట్టు, తెత్తుపేట ఏరియాలో మత్స్యసంపద దొరుకుతుండడంతో అక్కడికి వెళుతున్నారు. ఆ ప్రాంతం తమిళనాడు పరిధిలోనికి వస్తుందని పైన తెలిపిన మూడు కుప్పాలకు చెందిన జాలర్లు మీరు ఇక్కడికి వేటకు రాకూడదని ఆంక్షలు విధిస్తున్నారు. వాళ్లకు వాళ్లే సరస్సులో తాటిచెట్లు గుర్తులుగా నాటి హద్దు దాటకూడదని నిబంధనలు విధిస్తున్నారు. ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల్లోని నెల్లూరుజిల్లా, తిరువళ్లూరు జిల్లాల పరిధిలో సుమారు 600 చదరపు కిలోమీటర్లు పరిధిలో పులికాట్ విస్తరించి ఉంది. పులికాట్లో 16 దీవిగ్రామాలు, 30 తీరప్రాంత గ్రామాలున్నాయి. ఇందులో ఆంధ్రా పరిధిలో 17 కుప్పాలకు చెందిన 20 వేల మందికి పైగా చేపలవేటే ప్రధానవృత్తిగా జీవనం సాగిస్తున్నారు. పరోక్షంగా మరో పది వేల మంది గిరిజనులు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. చేపలవేట తప్ప మిగిలిన ఏ పని చేయలేని జాలర్లు గత 30 ఏళ్ల నుంచి ప్రతి ఏటా సరిహద్దు వివాదాలతో జీవనం కోల్పోతున్నారు. సరిహద్దు సమస్య తీరేనా..? 1989 నుంచి సరిహద్దు వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇరు రాష్ట్రాల జాలర్లు భారీ దాడులు చేసుకున్న సంఘటనలు కూడా లేకపోలేదు. దీనిపై రెండు రాష్ట్రాల అధికారులతో సర్వే చేయించాలని ఇక్కడ జాలర్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనికి సంబంధించి కొంతమేర నగదు కూడా ప్రభుత్వానికి చెల్లించారు. 1994లో సర్వే చేసేందుకు అధికారులు సిద్ధమైనప్పటికీ తమిళనాడు అధికారులు సహకరించకపోవడంతో సర్వే ఆగిపోయింది. 2007లో రాష్ట్ర మత్స్యశాఖామంత్రి మండలి బుద్ధప్రసాద్, తమిళనాడు మత్య్సశాఖ మంత్రి కేపీపీ స్వామిలతో రెండు రాష్ట్రాల మత్స్యశాఖాధికారులతో హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ చర్చలు విఫలమవడంతో సమస్య ప్రతి ఏటా ఉత్పన్నమవుతూనే ఉంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరిగితే మినహా సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.


