మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం | Fire Accident At Maha kumbh 2025 Sector 22 | Sakshi
Sakshi News home page

మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

Jan 30 2025 3:16 PM | Updated on Jan 30 2025 3:58 PM

Fire Accident At Maha kumbh 2025 Sector 22

ప్రయాగ్‌రాజ్‌: మహా కుంభామేళాలో మరో అపశృతి చోటుచేసుకుంది. కుంభామేళా వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్‌-22లో మంటలు చెలరేగాయి. ఎగసిపడుతున్న మంటల ధాటికి టెంట్లు కాలిపోతున్నాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెలుస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలి​యాల్సి ఉంది. 

వివరాల ప్రకారం.. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే మరో ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం కుంభమేళా జరుగుతున్న సెక్టార్-22లో మంటలు చెలరేగాయి. ఎగిసిపడుతున్న మంటల ధాటికి అక్కుడున్న టెంట్లు కాలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. మంటలు చెలరేగిన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, వరుస ప్రమాదాల నేపథ్యంలో భక్తులు ఆందోళన చెందుతున్నారు. 
 

ఇదిలా ఉండగా.. కుంభమేళాలో బుధవారం తొక్కిసలాట కారణంగా 30 మంది భక​్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో 60 మంది భక్తులు త్రీవంగా గాయపడ్డారు. ఇక, కొద్దిరోజుల క్రితమే కుంభమేళా వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ గుడారంలో రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడి నుంచి  క్రమంగా మంటలు వ్యాపించడంతో 18 టెంట్‌లు ఆహుతయ్యాయని తెలిపారు. మరోవైపు, దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. మహా కుంభమేళాలోని సెక్టార్‌ 19 వద్ద గుడారంలో రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలాయి. ఆ మంటలు ఇతర గుడారాలకు వ్యాపించాయి. కుంభమేళా (Kumbh Mela) వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా అప్పటికే ఉంచిన అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశాయి. సమీపంలోని టెంట్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement