థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి | Ennore Thermal Power Plant Accident | Sakshi
Sakshi News home page

థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి

Sep 30 2025 8:11 PM | Updated on Sep 30 2025 8:59 PM

Ennore Thermal Power Plant Accident

సాక్షి,చెన్నై: ఎన్నోర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తొమ్మిదిమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు.  

చెన్నై ఎన్నోర్‌లో అనల మిన్‌ స్టేషన్‌ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.  ఈ ప్రాజెక్టులో వందలాది మంది ఉత్తర భారత కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మించిన శ్లాబు కూలింది. 

ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పదుల సంఖ్యలో  గాయపడ్డారు. గాయపడిన వారిని చెన్నై రాయపురం స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషాదకర ఘటన ఎన్నోర్‌లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. 

 

ప్రమాదంపై తమిళనాడు విద్యుత్ బోర్డు (TNEB) చైర్మన్ జె.రాధాకృష్ణన్ మాట్లాడారు.‘ఈ ప్లాంట్‌లో మొత్తం 3,700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. భద్రతా అధికారులు, అధికారులు సమీపంలోని మూడు ప్లాంట్‌ల బృందాలతో పాటు, తనిఖీలు నిర్వహిస్తున్నారు.మరిన్ని సమస్యలు తలెత్తకుండా చూసుకుంటున్నారు’అని అన్నారు.
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement