టోల్‌ప్లాజా వద్ద ఏనుగు హల్‌చల్‌.. భయంతో వణికిపోయిన వాహనదారులు | Elephant Hulchul Near Toll Plaza On Dehradun-Haridwar Highway | Sakshi
Sakshi News home page

టోల్‌ప్లాజా వద్ద ఏనుగు హల్‌చల్‌.. భయంతో వణికిపోయిన వాహనదారులు

Aug 10 2025 8:01 AM | Updated on Aug 10 2025 9:05 AM

Elephant Hulchul Near Toll Plaza On Dehradun-Haridwar Highway

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని టోల్‌ ప్లాజా వద్ద ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. టోల్‌ ప్లాజా వద్ద క్యూ లైన్‌లో ఉన్న వాహనాలపై దాడి చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కారు డ్రైవర్‌ చాకచక్యంగా తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. డెహ్రాడూన్-హరిద్వార్ హైవేలోని లచ్చివాలా టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు క్యూ లైన్‌లో వెళ్తున్నాయి. వాహనాలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో మెల్లగా కదులుతుండగా.. ఓ ఏనుగు పక్కనే ఉన్న అడువుల్లోకి వెళ్లోంది. ఈ క్రమంలో టోల్‌ ప్లాజ్‌ వద్ద ఆగి ఉన్న వాహనాల వైపు వెళ్లింది. అనంతరం, లైన్‌లో ఉన్న ఓ కారుపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. తన తొండంతో కారు పైకి లేపి పడేసే ప్రయత్నం చేసింది.

..వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్‌ స్పీడ్‌గా కారును ముందుకు కదిలించాడు. దీంతో, ప్రమాదం తప్పింది. అనంతరం, పక్కనే ఉన్న వాహనాలను కూడా తాకుతూ ఏనుగు ముందుకు సాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు.. వాహనాదారులు ఈ ఘటనపై స్పందిస్తూ.. ఈ టోల్‌ ప్లాజా మార్గంలో ప్రతీరోజు ఏనుగుల బెడద ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement